ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid Alert: దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు

ABN, First Publish Date - 2023-03-12T18:24:21+05:30

దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆదివారంనాడు కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆదివారంనాడు కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య 500 నుంచి 524కు పెరిగింది. 113 రోజుల తర్వాత కేసుల్లో పెరుగుదల కనిపించిందని, తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,619కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కేరళలో తాజా మరణం సంభవించడంతో దేశంలో మొదటిసారి కరోనా విజృంభిచిన నాటి నుంచి ఇంతవరకూ కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,30,781కి చేరినట్టు ప్రభుత్వ డాటా తెలిపింది. కోవిడ్ కేసుల సంఖ్య 4.46 కోట్లుగా ఉంది. వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి శాతం (రికవరీ రేటు) 98.80గా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. కాగా, దేశంలో ఇంతవరకూ 220.64 కోట్ల వాక్సిన్ డోసులు ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌ పేర్కొంది.

Updated Date - 2023-03-12T18:24:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising