Ajit Pawar : కొత్త కార్యాలయాన్ని ప్రారంభించాలనుకున్న అజిత్ పవార్‌కు షాక్
ABN, First Publish Date - 2023-07-04T13:40:30+05:30
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీని చీల్చి, బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపిన అజిత్ పవార్ మంగళవారం నూతన కార్యాలయంలోకి ప్రవేశించాలని అనుకున్నారు. అయితే ఆ బంగళా తాళాలు కనిపించకపోవడంతో నేతలంతా బంగళా వెలుపల కూర్చోవలసి వచ్చింది. తాళాల కోసం అనేక మందికి ఫోన్లు చేశారు. ఎట్టకేలకు ప్రవేశ మార్గంలోని తలుపు తాళాన్ని తొలగించగలిగినప్పటికీ, బంగళా లోపలి గదుల తాళాలు దొరకలేదు.
ముంబై : శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీని చీల్చి, బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపిన అజిత్ పవార్ మంగళవారం నూతన కార్యాలయంలోకి ప్రవేశించాలని అనుకున్నారు. అయితే ఆ బంగళా తాళాలు కనిపించకపోవడంతో నేతలంతా బంగళా వెలుపల కూర్చోవలసి వచ్చింది. తాళాల కోసం అనేక మందికి ఫోన్లు చేశారు. ఎట్టకేలకు ప్రవేశ మార్గంలోని తలుపు తాళాన్ని తొలగించగలిగినప్పటికీ, బంగళా లోపలి గదుల తాళాలు దొరకలేదు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) వర్గంలోని యువ నేతలు ఈ బంగళా సింహద్వారం తాళాలను పగులగొట్టగలిగారు. ఆ తర్వాత నేతలు లోపలికి వెళ్ళారు. కానీ ఆ బంగళాలోని గదుల తాళాలు కూడా కనిపించకపోవడంతో హతాశులయ్యారు.
ఈ బంగళాలో గతంలో మహారాష్ట్ర (Maharashtra) శాసన మండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్ దాన్వే ఉండేవారు. ఆయన ఉద్ధవ్ థాకరేకు విధేయుడు. ఆయనకు వేరొక బంగళాను కేటాయించారు. అజిత్ పవార్ ఈ బంగళాను తన పార్టీ కార్యాలయం కోసం ఎంపిక చేసుకున్నారు.
ఇదిలావుండగా, ఎన్‌సీపీ (NCP) నేత అప్పా సావంత్ మాట్లాడుతూ, దాన్వే వ్యక్తిగత సహాయకుడు బంగళాకు తాళం వేసి, వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ బంగళా లోపల తాము అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పారు. తాము ఆయనకు ఫోన్ చేశామని, వచ్చేస్తున్నానని చెప్పారని తెలిపారు. దీని వెనుక ఏదో కుట్ర ఉందని కూడా ఆరోపించారు.
ఇదిలావుండగా, ఎన్‌సీపీ తనదంటే తనదని అజిత్ పవార్, శరద్ పవార్ (Sharad Pawar) చెప్తున్నారు. కానీ వీరు తమకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల వివరాలను బయటపెట్టడం లేదు. పార్టీ, ఎన్నికల గుర్తు కోసం న్యాయ పోరాటం చేయడానికి ఇరు వర్గాలు సమాయత్తమవుతున్నాయి.
ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయన వర్గానికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు లభించాయి.
ఇవి కూడా చదవండి :
Khalistan terrorists : సిక్కు తీవ్రవాదుల నిరసనలపై కెనడాను హెచ్చరించిన భారత్
Maha Congress : మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం మరికాసేపట్లో
Updated Date - 2023-07-04T13:40:30+05:30 IST