ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayan-3 : చంద్రయాన్-3 ప్రయోగం.. తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం విద్యార్థి ఘనత..

ABN, First Publish Date - 2023-07-13T11:51:46+05:30

ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో అస్సాంలోని తేజ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

Chayan Dutta, Chandrayan-3
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో అస్సాంలోని తేజ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అస్సాంకు మాత్రమే కాకుండా యావత్తు దేశానికి ఎంతో గర్వకారణమైన ఈ సందర్భాన్ని విద్యార్థినీ, విద్యార్థులు కేరింతలతో ఆస్వాదిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో చదవిన విద్యార్థి చయన్ దత్తా భాగస్వామ్యం కూడా చంద్రయాన్-3లో ఉండటాన్ని గర్వకారణంగా భావిస్తున్నారు.

అస్సామీస్ శాస్త్రవేత్త, తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం విద్యార్థి చయన్ దత్తా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్-3 ప్రయోగంలో లాంచ్ కంట్రోల్ ఆపరేషన్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఈ విశ్వవిద్యాలయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌ విద్యార్థి. ఆయన ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో సైంటిస్ట్/ఇంజినీర్-జీగా పని చేస్తున్నారు. ఆయన చంద్రయాన్-3, ల్యాండర్, డేటా హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్, ఆన్‌బోర్డ్ కమాండ్ టెలిమెట్రీకి నేతృత్వం వహిస్తున్నారు. కమాండ్ అండ్ డేటా హ్యాండ్లింగ్ సబ్ సిస్టమ్ ఈ ఆర్బిటర్‌కు బ్రెయిన్స్‌గా పని చేస్తుంది. వ్యోమనౌక (Spacecraft) కార్యకలాపాలన్నిటినీ ఇది నియంత్రిస్తుంది.

చంద్రయాన్-3 ప్రయోగం ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి శుక్రవారం జరుగుతుంది. దత్తా మాట్లాడుతూ, ఈ బాధ్యతను తనకు అప్పగించడం తనకు లభించిన గొప్ప గౌరవమని తెలిపారు. ఈ మిషన్ మన దేశానికి, ప్రపంచ శాస్త్ర సమాజానికి గొప్ప మైలురాయిగా నిలుస్తుందన్నారు.

తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ శంభు నాథ్ మాట్లాడుతూ, చంద్రయాన్-3 బృందాన్ని అభినందించారు. రోదసి అన్వేషణకు భారత దేశం కట్టుబడి, నిబద్ధతతో పని చేస్తోందని ఈ కీలక పరిణామం స్పష్టం చేస్తోందన్నారు. అంతేకాకుండా మన దేశంలో ఉన్న అసాధారణ ప్రతిభాపాటవాలు, నైపుణ్యాలను గొప్పగా వెల్లడిస్తోందన్నారు. ఇది మన దేశానికి, అస్సాంకు, తేజ్‌పూర్ విశ్వవిద్యాలయానికి గర్వపడే సమయమని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Floods : యమునా నదిలో వరద ఉద్ధృతి.. కేజ్రీవాల్ నివాసం వద్ద బీభత్సం..

Haryana : ఎమ్మెల్యే చెంప పగులగొట్టిన వరద బాధితురాలు

Updated Date - 2023-07-13T11:53:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising