BJP Leader killed: బీజేపీ మహిళా నేత దారుణ హత్య
ABN , First Publish Date - 2023-06-12T15:17:30+05:30 IST
అసోంలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ మహిళా నేతను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆమె మృత దేహాన్ని గోల్‌పరా జిల్లాలోని 17వ నెంబర్ జాతీయ రహదారిపై పడవేశారు. హతురాలిని గోల్‌పరా జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ సోనాలి నాథ్‌గా పోలీసులు గుర్తించారు.
గువాహటి: అసోంలో (Assam) దారుణం చోటుచేసుకుంది. బీజేపీ మహిళా నేతను (Women BJP leader) కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆమె మృత దేహాన్ని గోల్‌పరా జిల్లాలోని 17వ నెంబర్ జాతీయ రహదారిపై పడవేశారు. హతురాలిని గోల్‌పరా జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ సోనాలి నాథ్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎన్‌హెచ్-17 సమీపంలోని పలువురు గ్రామస్థులు ఆదివారం రాత్రి సోనాలి నాథ్ మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహంపై తీవ్రంగా గాయాలు ఉన్నట్టు వారు చెబుతున్నారు. దుండగులు ఆమెపై దాడి చేసి హత్యానంతరం హైవేపై విసిరేసి పరారయినట్టు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసు బృందం దుండగుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టింది. మృతురాలని గోలాపుర జిల్లా మతియా గ్రామ నివాసానికి చెదిన సోనాలి నాథ్‌గా గుర్తించినట్టు చెప్పారు. చివరిసారిగా ఆమె ఆదివారం మధ్యాహ్నం స్థానిక మార్కెట్‌లో కనిపించిందని, సాయంత్రం ఆమె భర్త ఫోన్ చేయగా ఫోను స్విచ్ఛాఫ్ అయినట్టు గుర్తించారని చెబుతున్నారు.
విచారణకు ఆదేశించిన మంత్రి
కాగా, ఈ ఘటన దురదృష్టకరమని, దీనిపై పూర్తి విచారణ జరిపించి న్యాయం చేస్తామని అసోం మంత్రి అశోక్ సింఘాల్ ఒక ట్వీట్‌లో తెలిపారు. హత్యా ఘటన వెనుక కారణాలను వెలికితీస్తామని అన్నారు. సోనాలి నాథ్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
కాగా, సోనాలి నాథ్ హత్యపై అసోం బీజేపీ అధ్యక్షుడు భబేష్ కలితాయ విచారం వ్యక్తం చేశారు. దుండగులను విడిచిపెట్టరాదని అన్నారు.