Assam Woman: భర్తతో పాటు అత్తను కూడా చంపి...శరీర భాగాలను ఫ్రిడ్జిలో దాచిన భార్య

ABN , First Publish Date - 2023-02-20T19:16:30+05:30 IST

శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన మరచిపోక ముందే అసోం రాజధాని గౌహతి లో దాదాపు ఇదే తరహా..

Assam Woman: భర్తతో పాటు అత్తను కూడా చంపి...శరీర భాగాలను ఫ్రిడ్జిలో దాచిన భార్య

గౌహతి: శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన మరచిపోక ముందే అసోం రాజధాని గౌహతి (Guwahati)లో దాదాపు ఇదే తరహా దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను, అత్తను చంపి, వారి మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి, కొద్దికాలం ఫ్రిజ్‌లో దాచి ఉంచిన తర్వాత వాటిని వివిధ ప్రాంతాల్లో విసిరేసిన అసోం మహిళ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా అనుమానిస్తున్నారు. నూన్‌మతి ఏరియాలో జరిగిన ఈ జంట హత్యల ఘటన సుమారు ఏడు నెలల తర్వాత ఈనెల 19న బయట ప్రపంచానికి తెలిసింది. నేరం ఒప్పుకోవడంతో నిందితురాలు వందన కలితను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో నిందితురాలు తన నేరం అంగీకరించింది. బాయ్ ఫ్రెండ్‌ సాయంతో భర్త అమర్‌జ్యోతి డే, అత్య శంకరి డే‌ను హత్య చేసినట్టు తెలిపింది.

పోలీసుల కథనం ప్రకారం, గత ఏడాది 17వ తేదీన ఈ హత్యల ఘటన చోటుచేసుకుంది. భర్తను, అత్తను చంపి, మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టింది. ఆ తర్వాత వాటిని మేఘాలయలోని పలు ప్రాంతాల్లో విసిరేసింది. భర్త శరీర భాగాలను దావ్కీ ఏరియాలోనూ, అత్త శరీర భాగాలను చెరపుంజిలోనూ పడేసింది. ఈ హత్యలకు అరూప్ డెక, ధన్‌జిత్ టెక అనే ఇద్దరు వ్యక్తులు సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. కట్టుకున్న భర్తను, అత్తను ఇంత పాశవికంగా హత్య చేయడం వెనుక కారణంపై విచారణ జరుపుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

వరుస ఘటనలు...

గత ఏడాది చివర్లో ఢిల్లీలోని మెహ్రౌలిలో శ్రద్ధావాకర్ హత్య కేసు తీవ్ర సంచలనమైంది. శ్రద్ధావాకర్‌తో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనావాలా ఆమెను పాశవికంగా చంపి, 35 ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత శివార్లలోని అడవుల్లో విసిరిపారేశాడు. ఐదు నెలల తర్వాత ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. ఇటీవలే నిక్కి యాదవ్ అనే యువతిని ఆమె పార్టనర్ సాహిల్ గెహ్లాట్‌ చంపి ఢిల్లీలోని తన రెస్టారెంట్ ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఈ ఘటన సైతం సంచలనం సృష్టించింది.

Updated Date - 2023-02-20T19:16:32+05:30 IST