Bengalore: ప్రజ్వల్ రేవణ్ణపై సుప్రీంలో కేవియట్ పిటిషన్
ABN , First Publish Date - 2023-09-08T11:25:22+05:30 IST
మాజీ ప్రధాని దేవేగౌడ(Former Prime Minister Deve Gowda) కుటుంబానికి మరోషాక్ తగలనుంది. రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని దేవేగౌడ(Former Prime Minister Deve Gowda) కుటుంబానికి మరోషాక్ తగలనుంది. రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం హాసన్ లోక్‌సభ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణ(Hasan Lok Sabha member Prajwal Revanna) సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల తీర్పును ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయినట్లు అయ్యింది. ఈలోగానే ప్రజ్వల్ రేవణ్ణ తరుపు న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టు తీర్పును రద్దు చేయాలని మరోసారి విన్నవించారు. మరో వైపు సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈలోగానే ప్రజ్వల్‌పై హైకోర్టులో కేసు దాఖలు చేసిన బీజేపీ నేత దేవరాజగౌడ సుప్రీంకోర్టులో కేవియెట్ పిటీషన్ దాఖలు చేశారు. గురువారం హాసన్‌లో దేవరాజగౌడ మీడియాతో మాట్లాడుతూ ప్రజ్వల్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారని భావించి ముందుగానే కెవియెట్ దాఖలు చేశాౄమన్నారు.
ఇలా సుప్రీంలోను న్యాయం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నో విధమైన ఒత్తిళ్ళు, వేధింపులు వచ్చినా వెనకడుగు వేయలేదన్నారు. ఒక సామాన్యుడికి న్యా యం లభించినట్లుగా భావిస్తున్నామన్నారు. హైకోర్టులో ఎంపీ సభ్యత్వం రద్దు చేసిన రోజునే సుప్రీంలో పిటీషన్ వేయాల్సి ఉండేదన్నారు. ఏకారణం చేత వారు ముందుకెళ్ళ లేదో తెలియదన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత 30 రోజుల్లో సుప్రీం కోర్టులో పిటీషన్ వేసేందుకు వీలుందని కానీ ముందుగానే కెవియెట్ వేశామన్నారు. ఒక వేళ సుప్రీంలో పిటీషన్ వేసినా అందుకు తగిన ఆధారాలు ధర్మాసనం ముందు ఉంచేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. సుప్రీంలో న్యాయం మావైపే రానుందని విశ్వాసం వ్యక్తం చేౄశారు.