ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP and JDS: ‘నైస్‌’ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

ABN, First Publish Date - 2023-07-22T12:23:54+05:30

అక్రమాల పుట్టగా మారి రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే నైస్‌ ప్రాజెక్టు(Bangalore - Mysore Express High

- రూ.1325 కోట్ల టోల్‌ఫీజు వసూలు చేయాల్సిందే

- నైస్‌ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

- ప్రతిపక్షాల డిమాండ్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అక్రమాల పుట్టగా మారి రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే నైస్‌ ప్రాజెక్టు(Bangalore - Mysore Express Highway is a nice project)ను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్‌ డిమాండ్‌ చేశాయి. విధానసౌధలోని జేడీఎస్‌ కార్యాలయంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రులు హెచ్‌డీ కుమారస్వామి, బసవరాజ్‌బొమ్మై సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. టోల్‌ రూపంలో ప్రజలను నైస్‌ కంపెనీ దారుణంగా వంచించిందని ఆరోపించారు. ‘నైస్‌’కు అదనంగా ఇచ్చిన భూమిని సైతం తక్షణం స్వాధీనం చేసుకోవాల్సిందేనన్నారు. నైస్‌ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని అప్పుడే అక్రమాలకు సంబంధించిన నిజాలు వెలుగుచూస్తాయన్నారు. శాసనసభ సంయుక్త సభాసంఘం నివేదిక, ధర్మాసనం ఆదేశాలు నైస్‌ కంపెనీలో అక్రమాలు జరుగుతున్నట్టు పేర్కొన్న సంగతిని గుర్తు చేశారు. నైస్‌ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే శాసనసభ బయటా, లోపల తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. నైస్‌ కంపెనీ రైతుల భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటూ దోపిడీకి పాల్పడుతోందని విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే అక్రమాలపై నెత్తీ నోరు బాదుకున్న సిద్దరామయ్య(Siddaramaiah) ఇప్పుడు చిత్తశుద్ధిని ప్రదర్శించాలని సవాల్‌ విసిరారు. ఇదే అంశంపై శాసనసభలో చర్చకోసం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా నిబంధన 69 కింద చర్చిస్తామని ప్రకటించినా అవకాశం ఇవ్వలేదన్నారు. రాష్ట్ర రైతుల, ప్రజల హితాన్ని గాలికి వదిలేస్తున్న, సామాన్యుల భూమిని కబ్జా చేస్తున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీని తలపిస్తున్న నైస్‌పై కాంగ్రెస్‌ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. తక్షణమే ఈ ప్రాజెక్టును నిలిపివేస్తే ప్రభుత్వానికి రూ.30వేల కోట్లకుపైగా నిధులు మిగులుతాయన్నారు. నైస్‌ రహదారి ప్రాజెక్టులో అంతకు ముందు కుదిరిన ఒప్పందాల ప్రకారం 2012లోగా కాంక్రీట్‌ రోడ్డు నిర్మించకపోతే అంతవరకు టోల్‌ వసూలు చేయరాదన్న నిబంధన స్పష్టంగా ఉందన్నారు. ఈ నియమాలను గాలికి వదిలి ఇంతవరకు సదరు కంపెనీ టోల్‌ పేరిట ప్రజలనుంచి రూ.1325 కోట్లు అక్రమంగా వసూలు చేసిందన్నారు. నిర్దాక్షిణ్యంగా సదరు మొత్తాన్ని నైస్‌ కంపెనీ ముక్కుపిండి వసూలు చేయాల్సిందేనని మాజీ ముఖ్యమంత్రులు డిమాండ్‌ చేశారు.

చరిత్రలో నైస్‌ వంటి భారీ అక్రమాలను తాను చూడలేదని స్వయంగా సీనియర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టీబీ జయచంద్ర ప్రకటించిన సంగతిని గుర్తు చేశారు. నైస్‌ ప్రాజెక్టుకోసం రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అదనపు భూమిని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని, సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా తేల్చి చెప్పిందన్నారు. శాసనసభ సంయుక్త సభాసంఘం నివేదిక, మంత్రిమండలి ఉపసమితి నివేదిక, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, నైస్‌ అక్రమాలపై స్పష్టత ఇస్తున్నా ప్రభుత్వం ఎందుకు మౌనముద్ర దాల్చిందో అర్థం కావడం లేదన్నారు. కాగా రాజకీయ సమావేశానికి హాజరు కావడం ద్వారా స్పీకర్‌ తన పీఠాన్ని దుర్వినియోగం చేశారని, ఐఏఎస్‌(IAS) అధికారుల సేవలను ప్రొటోకాల్‌ పేరిట ఇదే సమావేశం కోసం వినియోగించుకుని రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపారని కాంగ్రె్‌సపై మాజీ ముఖ్యమంత్రులు విరుచుకుపడ్డారు. రాష్ట్రప్రభుత్వ నిరంకుశ విధానాలపై రాజీలేని పోరు సాగించేందుకే తాము చేతులు కలిపామని వారు ప్రకటించారు.

Updated Date - 2023-07-22T12:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising