AAP Vs BJP : అవినీతిని సహించేది లేదు : బీజేపీ
ABN , First Publish Date - 2023-02-28T20:44:27+05:30 IST
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అని బీజేపీ నేత అమిత్ మాలవీయ (Amit Malaviya) ఆరోపించారు. సీబీఐ (Central Bureau of Investigation) ఛార్జిషీటులో ఆయన మొట్టమొదటి నిందితుడని పేర్కొన్నారు. ఇదంతా వివిధ రాజకీయ పార్టీల మధ్య ఉన్న అతి పెద్ద కుమ్మక్కు వ్యవహారమని ఆరోపించారు. సిసోడియా పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడాన్ని స్వాగతించారు.
మద్యం పాలసీ కుంభకోణం కేసులో (Delhi Excise policy case) అరెస్టై సీబీఐ కస్టడీలో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా(Manish Sisodia)కు సుప్రీంకోర్టు(Supreme Court) లో మంగళవారం నిరాశ ఎదురైంది. సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ పిటిషన్‌పై ఎందుకు విచారణ జరపాలని అడిగింది. ఢిల్లీ హైకోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని ప్రశ్నించింది. సంఘటన ఢిల్లీలో జరిగినంత మాత్రానికి, నేరుగా పరుగెత్తుకుంటూ ఇక్కడికి (సుప్రీంకోర్టుకు) రావాలని అనుకోకూడదని చెప్పింది. దీనికి ఓ క్రమపద్ధతి ఉంటుందని వివరించింది. సిసోడియా పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మరోవైపు సీబీఐ (CBI) రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) సిసోడియాకు సోమవారం ఐదురోజుల రిమాండ్ విధించింది. మార్చి 4 వరకు కస్టడీకి అప్పగించింది.
బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఇచ్చిన ట్వీట్‌లో సిసోడియా పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. ‘‘సత్యమేవ జయతే’’ అని పేర్కొన్నారు. మరో బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. నిజాయితీ గురించి ధ్రువపత్రాలను జారీ చేసే అలవాటుగల ఆప్ నేతలు అవినీతికి పాల్పడినట్లు తెలిపే టెక్స్ట్ బుక్ కేసు ఇది అని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Delhi University : తెలుగు, తమిళం ఎంపిక చేసుకున్న విద్యార్థుల కష్టాలు
Madhya Pradesh : ఎన్ఐఏ హెచ్చరికతో ఓ వ్యక్తి అరెస్ట్