Share News

Rajasthan Results: రాజస్థాన్‌లోనూ బీజేపీ ఆధిపత్యం..110 స్థానాల్లో లీడ్..

ABN , First Publish Date - 2023-12-03T10:37:17+05:30 IST

రాజస్థాన్ తొలి రౌండ్ల కౌంటింగ్‌లో బీజేపీ ఆధికంలో ఉంది. అధికారం తమదేనని రాష్ట్ర సీనియర్ బీజేపీ నేత సీపీ జోషి ధీమా వ్యక్తం చేశారు. 135 సీట్లకు మించి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Rajasthan Results: రాజస్థాన్‌లోనూ బీజేపీ ఆధిపత్యం..110 స్థానాల్లో లీడ్..

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ ఎన్నికల కౌంటింగ్‌ తొలి రౌండ్లలో బీజేపీ దూసుకుపోతుంది. రాష్ట్రంలో గెలుపునకు మేజిక్ ఫిగర్ 100కాగా బీజేపీ ప్రస్తుతం 110 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 75 స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. మునుపటి ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈమారు 37 అదనపు సీట్లలో లీడ్‌లో ఉండగా కాంగ్రెస్ 24 స్థానాల్లో ప్రత్యర్థికంటే వెనుకంజలో ఉంది. ఈ నేపథ్యంలో విజయం తమదేనన్న ధీమా బీజేపీ వర్గాల్లో కనిపిస్తోంది.

కాగా, టాంక్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ కాస్తంత వెనుకబడ్డారు. సీఎం అశోక్ గెహ్లాట్ మాత్రం తన సర్దార్‌పూర్ నియోజకవర్గంలో లీడ్‌లో ఉన్నారు. ఒకే పార్టీకి రెండోమారు అధికారం ఇవ్వని రాష్ట్రంలో అధికారం నిలుపుకునేందుకు కాంగ్రెస్ శ్రమిస్తుండగా ట్రెండ్‌ను అనుసరించి తాము అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమాగా ఉంది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్‌కు 80-100 సీట్లు, కాంగ్రెస్‌కు 86-106 మధ్య సీట్లు దక్కాలి. తొలి రౌండ్ల ఓటింగ్ సరళి బీజేపీకి అనుకూలంగా ఉండటంపై బీజేపీ సీనియర్ సీపీ జోషి హర్షం వ్యక్తం చేశారు. 135 సీట్లకంటే ఎక్కువగా గెలుచుకుంటామని ప్రకటించారు. తాము ఇప్పటికే లడ్డూలు పంచామని కూడా మీడియాతో వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-12-03T10:37:22+05:30 IST