AAP Vs BJP : అవినీతిని ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చినా... : బీజేపీ

ABN , First Publish Date - 2023-02-26T16:08:35+05:30 IST

ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆదివారం ఉదయం సీబీఐ కార్యాలయానికి

AAP Vs BJP : అవినీతిని ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చినా... : బీజేపీ
Sambit Patra, Manish Sisodia

న్యూఢిల్లీ : అవినీతిని ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చినంత మాత్రానికి దానిని దాచిపెట్టడం సాధ్యం కాదని బీజేపీ స్పష్టం చేసింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో ప్రశ్నలకు ఆమ్ ఆద్మీ పార్టీ సమాధానాలను చెప్పలేదని ఆరోపించింది. సత్యాన్ని దాచిపెట్టడంలో వారు తీరిక లేకుండా గడుపుతున్నారనే విషయం సుస్పష్టమని తెలిపింది.

ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆదివారం ఉదయం సీబీఐ కార్యాలయానికి వెళ్ళడానికి ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేసి, రోడ్ షో నిర్వహించారు. తాను భగత్ సింగ్ అనుచరుడినని తెలిపారు. భగత్ సింగ్ దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారన్నారు. తప్పుడు ఆరోపణలపై జైలుకు వెళ్ళడం తనకు చాలా చిన్న విషయమని చెప్పారు. కొద్ది నెలలపాటు జైలు జీవితం గడపవలసి వస్తే, దానిని తాను ఏ మాత్రం పట్టించుకోనని అన్నారు.

సిసోడియా ఇచ్చిన ట్వీట్‌లో, ఆదివారం ఉదయం తాను సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతానని తెలిపారు. ఈ దర్యాప్తులో తాను సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు. లక్షలాది మంది బాలల ప్రేమాభిమానాలు, కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదాలు తనకు ఉన్నాయన్నారు. కొద్ది నెలలపాటు జైలులో ఉండవలసి వస్తే తాను పట్టించుకోనన్నారు.

సీబీఐ (Central Bureau of Investigation) విచారణకు హాజరయ్యే ముందు సిసోడియా (Manish Sisodia) నిర్వహించిన రోడ్ షోలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా (Sambit Patra) మీడియాతో మాట్లాడుతూ, అవినీతిని ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. దానివల్ల ఆ అవినీతిని దాచిపెట్టడం సాధ్యం కాదన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐకి ఆమ్ ఆద్మీ పార్టీ ఎటువంటి సమాధానం చెప్పలేదన్నారు. ఆ పార్టీవారు సీబీఐ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు. వారు సత్యాన్ని దాచిపెట్టడంలో తీరిక లేకుండా గడుపుతున్నారన్నారు. సీబీఐ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, ఈవెంట్ మేనేజ్‌మెంట్ అవసరం లేదని అన్నారు.

ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగినట్లు నమోదైన సీబీఐ కేసులో మనీశ్ సిసోడియా నిందితుడు. ఈ కుంభకోణం జరిగిన సమయంలో ఎక్సయిజ్ మంత్రిగా ఆయన వ్యవహరించారు. ముడుపులు తీసుకుని ఎక్సయిజ్ సుంకాలను తగ్గించడం, అక్రమంగా లైసెన్సులు మంజూరు చేయడం వంటి అక్రమాలకు ఆయన పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో దర్యాప్తు జరపాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత ఏడాది ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Mann Ki Baat : మొబైల్ పేమెంట్ సిస్టమ్‌పై మోదీ సంచలన వ్యాఖ్యలు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వోద్యోగులకు తీపి కబురు

Updated Date - 2023-02-26T16:08:39+05:30 IST