ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP-JDS: ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లేనా..! అదేగాని జరిగితే.. అధికార పార్టీకి ఇక...

ABN, First Publish Date - 2023-09-23T10:53:41+05:30

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్‌(BJP-JDS) కలసికట్టుగా ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంటు

- సీట్ల పంపిణీపై త్వరలో చర్చలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్‌(BJP-JDS) కలసికట్టుగా ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన మాజీ ప్రధాని, జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను గురువారం భేటీ అయ్యా రు. ఉభయ పార్టీల పొత్తుకు సంబంధించి సూత్రప్రాయం గా ఈ సమావేశంలో అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 28 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను తమకు నాలుగు స్థానాలు ఇవ్వాలని దళపతి దేవెగౌడ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సినీనటి సుమలత(Movie actress Sumalatha) ప్రాతినిధ్యం వహిస్తున్న మండ్య నియోజకవర్గంపై కూడా జేడీఎస్‌ ఈసారి కన్నేసినట్లు సమాచారం. కాగా మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy) కూడా పొత్తుపై బీజేపీ అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీలోనే తిష్టవేశారు. గురువారం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అ నంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ దుష్టపాలన నుంచి ప్రజలకు విముక్తి ప్రసాదించేందుకు కాంగ్రె్‌స్‌ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకే తాము బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యామని చెప్పారు. తమ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నట్లు వెలువడుతున్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. సీట్ల పంపిణీ వ్యవహారంపై బీజేపి అధిష్టానం పెద్దలతో మరో రెండు సమావేశాలు ఉంటాయని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. కావేరి జల వివాదంపై బీజేపీతో కలిసి పోరాటం చేయాలని తమ పార్టీ తీర్మానించిందన్నారు. ‘ఇండియా’ కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకేకు లబ్ధి చే కూర్చేందుకే కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేశారని ఆయన ఆరోపించారు.

బీజేపీ నేతల హర్షం

కేంద్రంలో ఎన్‌డీయేకు మద్దతు ఇవ్వాలని జేడీఎస్‌ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ బీజేపీ, జేడీఎస్‌ పొత్తు రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షగా ఉందన్నారు. పొత్తు కారణంగా అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని, జేడీఎస్‌ కూడా రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై కూడా జేడీఎస్‏తో పొత్తును స్వాగతించారు. జేడీఎస్‌ చేరికతో ఎన్‌డీయే మరింత బలోపేతం కావడం ఖాయమన్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ ఈ పొత్తు ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు.

Updated Date - 2023-09-23T11:06:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising