ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lalu yadav: లాలూకు బెయిలుపై సుప్రీంకోర్టులో సవాలు చేసిన సీబీఐ

ABN, First Publish Date - 2023-08-18T14:14:07+05:30

పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన డోరండ ట్రెజరీ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖాండ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సీబీఐ శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

న్యూఢిల్లీ: పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన డోరండ ట్రెజరీ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)కు జార్ఖాండ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సీబీఐ శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ అప్పీల్‌ను ఆగస్టు 25న లిస్ట్ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. కోట్లాది రూపాయల కుంబకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో (డుంకా, చైబస, డోరండ, డియోగఢ్ ట్రెజరీలు) జార్ఖాండ్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సీబీఐ సవాలు చేసింది. లాలూకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని దర్యాప్తు సంస్థ కోరింది.


డోరండా ట్రెరీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా సీబీఐ ప్రత్యేక కోర్టు గత ఫిబ్రవరిలో నిర్ధారించింది. బీహార్ సీఎంగా లాలూ హయాంలో పశుగ్రాసం, ఇతర అవసరాల పేరుతో తప్పుడు ఖర్చులు చూపించి వివిధ ప్రభుత్వ ఖజానాల నుంచి రూ.950 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేసుకున్నట్టు సీబీఐ ఆరోపణగా ఉంది. డోరండా ట్రెజరీ కేసులోని 99 మంది నిందితుల్లో 24 మందిని నిర్దోషులుగా, 46 మందికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ గత వారం కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ఈ నాలుగు ట్రెజరీ కేసుల్లో 74 ఏళ్ల లాలూకు కోర్టు గతంలో 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

Updated Date - 2023-08-18T14:14:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising