Chandrayaan-3: ఇది ప్రతి భారతీయుని సమష్టి విజయం: కాంగ్రెస్
ABN , First Publish Date - 2023-08-23T20:01:17+05:30 IST
చంద్రయాన్-2 విజయవంతం కావడంపై కాంగ్రెస్ పార్టీ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ఇది ప్రతి ఒక్క భారతీయుని సమష్టి విజయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ఈరోజు సాకారమయ్యాయని అన్నారు.
న్యూఢిల్లీ: చంద్రయాన్-2 (Chandrayaan-3) విజయవంతం కావడంపై కాంగ్రెస్ (Congress) పార్టీ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ఇది ప్రతి ఒక్క భారతీయుని సమష్టి విజయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ట్వీట్ చేశారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ఈరోజు సాకారమయ్యాయని, ఆరు దశాబ్దాల అంతరిక్ష కార్యక్రమాల్లో మరో విజయాన్ని సాధించామని అన్నారు. భారతదేశం గర్వపడేలా ఈ ప్రయోగం విజయవంతం కావడానికి అంకితభావంతో కరోఠ శ్రమ చేసిన శాస్త్రవేత్తలు, స్పేస్ ఇంజనీర్లు, పరిశోధకులకు దేశ ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు.
మూన్ ఇంపాక్ట్ ప్రోగ్రాం (ఎంఐపీ) కింద 2008లో చంద్రయాన్ మిషన్-1 భారతదేశ జెండాను జాబిల్లి పైకి తీసుకు వెళ్లిందని, చంద్రుని ఉపరితలంపైకి సైంటిఫిక్ డివైజ్‌ను ల్యాండ్ చేసిన 4వ దేశంగా భారత్ నిలిచిందని ఖర్గే అన్నారు. ఈరోజు చంద్రయాన్-3న మన శాస్త్ర పరిశోధనల సత్తాను ప్రపంచానికి చాటిందని ప్రశంసించారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ సాఫ్ట్‌గా జాబిల్లిపై ల్యాండ్ కావడం అంతరిక్ష పరశోధనా రంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ హోమి జె.భాభా, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ సతీష్ ధావన్, డాక్టర్ మేఘ్‌నాద్ సాహా, డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఇంకా ఎంతో మంది శాస్త్రవేత్తలకు ఘన నివాళిగా ఖర్గే అభివర్ణించారు. సైన్స్ పట్ల కమిట్‌మెంట్‌తో పనిచేసిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కన్న కలలను సాకారం చేస్తూ ఆయన స్ఫూర్తిని దేశ ప్రజలు అందుపుచ్చుకున్నారని, తుదపరి ప్రధానులు సైతం ఇదే బాటలో కృషి చేశారని గుర్తుచేశారు. జై హింద్...జై విజ్ఞాన్...అంటూ ఖర్గే తన ట్వీట్‌ను ముగించారు.