Corona Ward: 150 పడకలతో కరోనా వార్డు సిద్ధం
ABN, First Publish Date - 2023-04-05T09:34:31+05:30
స్థానిక సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 150 పడకలతో కరోనా ప్రత్యేక వార్డు(Corona Special Ward)
పెరంబూర్(చెన్నై): స్థానిక సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 150 పడకలతో కరోనా ప్రత్యేక వార్డు(Corona Special Ward) సిద్ధమైంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 200 దాటింది. దీంతో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టిన రాష్ట్రప్రభుత్వం, ప్రభుత్వాసుపత్రులు, బహిరంగ ప్రాంతాలు, థియేటర్లు వాణిజ్య కాంప్లెక్స్‌లో ప్రజలు మాస్కు ధారణ తప్పనిసరి చేసింది. అలాగే, బాధితులకు చికత్సలందించేలా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డులు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వార్డులో నలుగురు బాధితులు చికిత్సలు పొందుతుండగా, వారిలో ఒకరు ఆక్సిజన్‌పై ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Updated Date - 2023-04-05T09:34:31+05:30 IST