Covid cases: దేశంలో కరోనా కేసుల కలకలం...పెరుగుతున్న పాజిటివిటీ రేటు
ABN, First Publish Date - 2023-04-12T12:50:47+05:30
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది...
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.(Covid cases) దేశంలో ఒక్కరోజే 7,830 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గడచిన 223 రోజుల్లోనే మంగళవారం అత్యధికంగా 7,830(New Covid cases) కొవిడ్ కేసులు వెలుగుచూశాయి.(Outbreak In India) దీంతో బుధవారం నాటికి దేశంలో 40,215 యాక్టివ్ కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా మరో 16 మంది కరోనాతో మరణించారు.
ఇది కూడా చదవండి : Earthquake: దేశంలో ఒకే రోజు మూడు ప్రాంతాల్లో భూకంపం
ఢిల్లీ,పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలో ఇద్దరు చొప్పున, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకరు చొప్పున కరోనాతో కన్నుమూశారు. దేశంలో గత ఏడాది సెప్టెంబర్ 1న భారతదేశంలో ఒకే రోజు 7,946 COVID-19 కేసులు నమోదయ్యాయి.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,016 కు పెరిగింది.దేశవ్యాప్తంగా కొవిడ్(COVID-19)వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లు అందించారు. ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో 402 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
Updated Date - 2023-04-12T12:50:47+05:30 IST