Covid -19: రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2023-04-07T16:28:31+05:30 IST

కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా(Union Health Minister Dr Mansukh Mandaviya ) కోవిడ్ కేసులు, నిర్వహణ చర్యలపై ..

Covid -19: రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండండి

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా(Union Health Minister Dr Mansukh Mandaviya ) కోవిడ్ కేసులు, నిర్వహణ చర్యలపై వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు(States Health Ministers), ప్రిన్సిపల్ సెక్రటరీ(Principal secretaries)లతో ఆన్‌లైన్ నిర్వహించారు. దేశంలో కోవిడ్ కేసులు(Covid Cases) పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు పెరగకుండా అడ్డుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

ఇందులో భాగంగా ఏప్రిల్ 10, 11 తేదీల్లో అన్ని హాస్పిటల్స్‌లో సన్నాహక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నెల8,9 తేదీల్లో జిల్లా ఉన్నతాధికారులు, ఆరోగ్యశాఖ అధికారులతో కోవిడ్ చర్యలపై సమీక్షించాలని ఆరోగ్య మంత్రులను కోరారు.

Updated Date - 2023-04-07T16:29:21+05:30 IST