ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Assam : కోవిడ్ లాక్‌డౌన్ లవ్ స్టోరీ.. ముగ్గురి హత్యతో విషాదాంతం..

ABN, First Publish Date - 2023-07-26T14:24:54+05:30

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడం కోసం దేశవ్యాప్తంగా విధించిన అష్ట దిగ్బంధనం సమయంలో చిగురించిన ప్రేమ ముగ్గురి హత్యతో విషాదాంతమైంది. ఎంతో నమ్మకంతో పెళ్లి చేసుకున్న యువతిని, ఆమె తల్లిదండ్రులను ఆ యువకుడు కిరాతకంగా హత్య చేసి, పోలీసులకు లొంగిపోయాడు.

గువాహటి : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడం కోసం దేశవ్యాప్తంగా విధించిన అష్ట దిగ్బంధనం సమయంలో చిగురించిన ప్రేమ ముగ్గురి హత్యతో విషాదాంతమైంది. ఎంతో నమ్మకంతో పెళ్లి చేసుకున్న యువతిని, ఆమె తల్లిదండ్రులను ఆ యువకుడు కిరాతకంగా హత్య చేసి, పోలీసులకు లొంగిపోయాడు. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయేటపుడు ఆ దుర్మార్గుడి చేతుల్లో తమకు పుట్టిన తొమ్మిది నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కన్నీటిపర్యంతం చేస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అస్సాంలోని గోలాఘాట్‌‌కు చెందిన నజీబుర్ రెహమాన్ బోరా (25), సంఘమిత్ర ఘోష్ (24) కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో 2020 జూన్‌లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. కొద్ది నెలలకే వీరి స్నేహం ప్రేమగా మారింది. అదే సంవత్సరం అక్టోబరులో వీరిద్దరూ కోల్‌కతాకు పారిపోయారు. ఆమెను ఆమె తల్లిదండ్రులు తిరిగి తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. అయితే అప్పటికే వీరిద్దరికీ కోల్‌కతాలో వివాహం జరిగింది.


సంఘమిత్ర దొంగతనం చేసినట్లు ఆమె తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జును ఘోష్ 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘమిత్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఓ నెల రోజులు జ్యుడిషియల్ కస్టడీలో నిర్బంధంలో ఉన్నారు. బెయిలు పొందిన తర్వాత తిరిగి ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. 2022 జనవరిలో సంఘమిత్ర, నజీబుర్ మళ్లీ పారిపోయారు. ఈసారి వీరిద్దరూ చెన్నై వెళ్లిపోయారు. అక్కడ ఐదు నెలలపాటు గడిపారు. ఆగస్టులో తిరిగి గోలాఘాట్ వెళ్లారు. అప్పటికి ఆమె గర్భవతి. వీరిద్దరూ నజీబుర్ ఇంట్లోనే ఉండేవారు. గత ఏడాది నవంబరులో వీరికి కుమారుడు జన్మించాడు.

ఈ ఏడాది మార్చిలో సంఘమిత్ర తన కుమారుడిని తీసుకుని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయారు. తనను నజీబుర్ వేధిస్తున్నాడని, హింసిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కేసును నమోదు చేశారు. దీంతో నజీబుర్ అరెస్టయ్యారు. 28 రోజుల తర్వాత ఆయనకు బెయిలు మంజూరైంది. అనంతరం సంఘమిత్ర ఇంటికి వెళ్లి, తన కుమారుడిని చూపించాలని కోరారు. కానీ సంఘమిత్ర కుటుంబ సభ్యులు ఆ బాలుడిని చూపించేందుకు నిరాకరించారు. నజీబుర్‌ను సంఘమిత్ర, ఆమె కుటుంబ సభ్యులు కొట్టినట్లు నజీబుర్ సోదరుడు ఏప్రిల్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నజీబుర్ సోమవారం మధ్యాహ్నం సంఘమిత్ర ఇంటికి వెళ్లి, ఆమెను, ఆమె తల్లిదండ్రులను హత్య చేశాడు. తొమ్మిది నెలల వయసుగల కుమారుడిని తీసుకుని, పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

ఈ కేసుపై సీఐడీ దర్యాప్తు జరుగుతోందని అస్సాం పోలీస్ చీఫ్ జీపీ సింగ్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి :

Infosys Foundation : సుధా మూర్తి ఆహారపు అలవాట్లపై దుమారం

Weather : ఉత్తరాంధ్ర, తెలంగాణ, అస్సాం, ఒడిశా, కొంకణ్, మలబార్ తీరాలకు భారీ వర్ష సూచన

Updated Date - 2023-07-26T14:24:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising