ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid-19 Scare: భయం లేదు..సర్వ సన్నద్ధంగా ఉన్నాం: కేజ్రీవాల్

ABN, First Publish Date - 2023-03-31T16:15:53+05:30

దేశ రాజధానిలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారంనాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కోవిడ్-19 (Covid-19) కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శుక్రవారంనాడు సమీక్షా సమావేశం జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ కేసుల పెరుగుదలపై దృష్టి సారించామని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

''ఆరోగ్య శాఖ మంత్రి భరద్వాజ్ ఆ శాఖ అధికారులతో గురువారంనాడు సమీక్షించారు. ఇవాళ వారితో నేను సమావేశమయ్యారు. కోవిడ్ కేసులు పెరుదుతున్న ఆరు రాష్ట్రాలను రెండు వారాల క్రితం కేంద్రం గుర్తించింది. వాటిలో కేరళ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. ఢిల్లీ రాష్ట్రం లేదు. ప్రత్యేక సూచనలు మాత్రం చేశారు. ఢిల్లీలో మార్చి 15 నాటికి కేవలం 42 కేసులు నమోదయ్యాయి. కేవలం పది రోజుల్లోనే (మార్చి 30) ఆ సంఖ్య 295కి చేరింది. గురువరాంనాడు 2,363 టెస్టులు నిర్వహించాం. భయపడాల్సిన పని లేదు. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం'' అని మీడియాకు కేజ్రీవాల్ తెలిపారు.

నాలుగైదు రోజుల్లో 3 కేసులే..

కాగా, గత నాలుగైదు రోజుల్లో కేవలం మూడు మరణాలే సంభవించాయని, కోవిడ్ అనేది ఇన్సిడెంటల్ మాత్రమేనని అన్నారు. అయితే, దీనిని నిర్ధారించాల్సి ఉందన్నారు. మృతుల్లో ఒకరు కిడ్నీ మార్పిడి చేయించుకుని మూడు నెలలుగా ఆసుపత్రిలో ఉన్నారని, అతను కోవిడ్‌తో చనిపోయాడాని చెప్పడం సరికాదని అనుకుంటున్నాను. కోవిడ్ బారిన పడి చనిపోయిన వారిలో ముగ్గురు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఢిల్లీ బయట నుంచి వచ్చారు'' అని కేజ్రీవాల్ చెప్పారు.

XBB1.16 వేరియంట్...

ప్రస్తుతం ప్రీడామినెంట్ వేరియంట్‌గా XBB1.16 ఉందని, 48 కేసుల్లో ఈ వేరియంట్ ఉందని చెప్పారు. ఇతరుల్లో దీని సబ్ వేరియంట్‌ ఉందని తెలిపారు. ఈ కేసుల్లో వైరల్ వేగంగా వ్యాప్తి చెంతుదని, అయితే ఇది మరీ తీవ్రం కాదని చెప్పారు. ఆసుపత్రిపాలు కావడం, మరణాలు మరీ ఎక్కువగా లేవని చెప్పారు. ఆసుపత్రుల్లో పడకల అందుబాటుపై మాట్లాడుతూ, కోవిడ్ పేషెంట్ల కోసం ఐసొలేషన్ వార్డులు అందుబాటులో ఉంచాలని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదేశాలిచ్చామని, మొత్తం7,986 పడకలు అందుబాటులో ఉండగా, 66 పడకల్లోనే పేషెంట్లు ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వ ల్యాబ్‌లలో 4,000 పరీక్షలు, ప్రైవేటు ల్యాబుల్లో లక్ష టెస్టులు నిర్వహించగలిగే సామర్థ్యం ఉందని తెలిపారు. తగినన్ని ఆక్సిజన్ నిల్వలు, అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం, ఢిల్లీలో గురువారంనాడు కొత్తగా 295 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 12.48గా ఉంది. కాగా, దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కోవిడ్ కేసుల సంఖ్య రెండోరోజు కూడా 3,000కు పైనే ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 13,509 నుంచి 15,209కి పెరిగింది.

Updated Date - 2023-03-31T16:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising