Share News

Diwali Bonus: నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు సీఎం దీపావళి బొనంజా

ABN , First Publish Date - 2023-11-06T16:01:05+05:30 IST

గ్రూప్-బి, సి నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు రూ.7,000 చొప్పున దీపావళి బోనస్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది.

Diwali Bonus: నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు సీఎం దీపావళి బొనంజా

న్యూఢిల్లీ: గ్రూప్-బి, సి నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు (Gruoup B, C Non-Gazetted Employees) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు రూ.7,000 చొప్పున దీపావళి బోనస్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది.


''గ్రూప్ బి నాన్ గెజిటెడ్, గ్రూప్ సి ఉద్యోగులకు రూ.7,000 చొప్పున బోనస్ ఇస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వంలో 80,000 మంది గ్రూప్ బి, సి ఉద్యోగులు పని చేస్తున్నారు. బోనస్ కింద రూ.56 కోట్లు వెచ్చిస్తున్నాం'' అని ఒక వీడియో సందేశంలో సీఎం కేజ్రీవాల్ తెలిపారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన, ప్రజాసేవల రంగంలో గత ఎనిమిదేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం ఎన్నో గొప్ప పనులు చేసిందని, ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర గణనీయమైనదని చెప్పారు. ఉద్యోగుల అంకితభావం, కఠోర శ్రమతో ఢిల్లీని డ్రీమ్ సిటీగా చేయగలిగామని ప్రశంసించారు.


కాగా, ఆప్ ప్రభుత్వం నవంబర్ 1న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)లో పనిచేసే 5000 మంది పారిశుధ్య కాంట్రాక్టు ఉద్యోగులను పెర్మనెంట్ చేశారు. ఇంతవరకూ 6,494 పారిశుధ్య కార్మికుల ఉద్యోగాలను పెర్మనెంట్ చేశామని, ప్రభుత్వ నిర్ణయంతో వేలాది కుటుంబాల్లో ముందే దీపావళి వచ్చిందని కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు.

Updated Date - 2023-11-06T16:58:03+05:30 IST