Firecrackers Ban: ఈ ఏడాది కూడా ఢిల్లీలో బాణసంచాపై నిషేధం
ABN , First Publish Date - 2023-09-11T16:11:47+05:30 IST
వాతావారణ కాలుష్యం అదుపు పేరుతో మరోసారి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశరాజధానిలో అన్ని తరహాల బాణసంచా (Firecrackers) తయారీ, అమ్మకాలు, నిల్వలపై తిరిగి నిషేధం విధించింది. వాతావరణ కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
న్యూఢిల్లీ: వాతావారణ కాలుష్యం అదుపు పేరుతో మరోసారి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశరాజధానిలో అన్ని తరహాల బాణసంచా (Firecrackers) తయారీ, అమ్మకాలు, నిల్వలపై తిరిగి నిషేధం (Ban) విధించింది. వాతావరణ కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ (Gopal Rai) తెలిపారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, బాణసంచాకు సంబంధించి ఎవరికీ లైసెన్స్‌లు ఇవ్వరాదని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలిచ్చామని చెప్పారు.
''ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ గత ఐదేళ్లుగా గణనీయంగా మెరుగుపడింది. అయితే మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఆ కారణంగానే ఈ ఏడాది కూడా బాణసంచా తయారీ, అమ్మకాలు, నిల్వలపై నిషేధం విధించాం'' అని గోపాల్ రాయ్ తెలిపారు. కాగా, గత మూడేళ్లుగా అన్ని తరహాల బాణసంచాల తయారీ, అమ్మకాలను ఢిల్లీ ప్రభుత్వం నిషేధిస్తూ వస్తోంది. సిటీలో దీపావళికి బాణసంచా కాల్చిన వారికి ఆరు నెలలు జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తామని గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. బాణసంచా తయారీ, అమ్మకాలు, నిల్వలు జరిపితే పేలుడు పదార్ధాల చట్టంలోని 9బి సెక్షన్ కింద రూ.5,000 జరిమానా, మూడేళ్ల జైలు విధిస్తామని కూడా హెచ్చరించింది.