ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో సిసోడియాకు సీబీఐ కస్టడీ

ABN, First Publish Date - 2023-02-27T17:32:43+05:30

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది.

Manish Sisodia
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మద్యం పాలసీ కుంభకోణం కేసులో (Delhi Excise policy case) అరెస్టయిన ఆప్‌ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా(Manish Sisodia)ను సీబీఐ (CBI) రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ఐదురోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. మార్చి 4 వరకు కస్టడీకి అప్పగించింది. అంతకుముందు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు సిసోడియాను ఐదు రోజులపాటు రిమాండ్‌కు ఇవ్వాలని సీబీఐ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఎందుకు సిసోడియా రిమాండ్ అడుగుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సిసోడియాను ఇంకా విచారించాల్సి ఉందని, వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు. తాము అడిగిన కీలక అంశాలపై వివరణ ఇవ్వకుండా సిసోడియా దాటవేశారని చెప్పారు. సిసోడియా ఒకేసారి పలు మొబైల్ ఫోన్లను మార్చి నిందితులతో మాట్లాడిన సాక్ష్యాలు లేకుండా చేశారని సీబీఐ తరపు న్యాయవాది చెప్పారు. లిక్కర్ పాలసీలో చివరి నిమిషంలో మార్పులతో లైసెన్స్లు పొందిన వారికి లబ్ధి చేకూర్చారని చెప్పారు. లిక్కర్ పాలసీలో కమీషన్ను 5 నుంచి ఏకంగా 12 శాతానికి పెంచారని సీబీఐ తరపు న్యాయవాది ఆరోపణలు చేశారు. కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రత్యేక కోర్టు జడ్జి ముందు ప్రస్తావించారు.

మరోవైపు సిసోడియా విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తప్పుడు ఆరోపణలతో రిమాండ్ అడుగుతున్నారని ఆరోపించారు.

ఇరు పక్షాల వాదనలు ముగిశాక ఆర్డర్‌ను రిజర్వ్‌లో ఉంచిన కోర్టు ఎట్టకేలకూ సిసోడియాను ఐదురోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది.

మద్యం పాలసీ కుంభకోణం కేసులో సీబీఐ సిసోడియాను నిన్న అరెస్టు చేసింది. సుమారు 8 గంటల పాటు ప్రశ్నించినా ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాలేదని సీబీఐ అధికారులు తెలిపారు. ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. సిసోడియా నిన్న ఉదయం 11.12 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సీబీఐలోని అవినీతి నిరోధక విభాగం అధికారులు ఆయనను ఈ కేసులో పలు అంశాలపై ప్రశ్నించారు.

దినేశ్‌ అరోరాతో పాటు ఇతర నిందితులతో సంబంధాలు, అనేక ఫోన్ల ద్వారా పంపిన, అందుకున్న మెసేజ్‌ల వివరాల గురించి అడిగామని అధికారులు తెలిపారు. సిసోడియా ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని, ఆయన దర్యాప్తునకు సహకరించలేదని పేర్కొన్నారు. తాము అడిగిన కీలక అంశాలపై వివరణ ఇవ్వకుండా దాటవేశారని చెప్పారు. కాగా, ఈ కేసులో ఆధారాలను ధ్వంసం చేయడంలో ఆయన ప్రమేయం ఉందని సీబీఐ అరెస్టు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐపీసీ 120 బీ, 477 ఏ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 కింద ఆయనను అరెస్టు చేశారు.

మరోవైపు ఇవాళ కూడా సీబీఐ కార్యాలయం వద్ద పెద్దఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అక్కడ ఆందోళనకు దిగిన పలువురు ఆప్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. వాస్తవానికి సీబీఐ సిసోడియాకు గత ఆదివారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్నందున తనకు కొంత గడువు ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో విచారణ ఈ ఆదివారానికి వాయిదా వేసింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా ఉన్న సిసోడియాను గతేడాది అక్టోబరు 17న మొదటిసారి 9 గంటల పాటు ప్రశ్నించింది. నవంబరు 25న చార్జిషీట్‌ దాఖలు చేసి నా... దాంట్లో సిసోడియా పేరు చేర్చలేదు. దినేశ్‌ అరోరా ఇచ్చిన స్టేట్‌మెంట్‌, ‘సౌత్‌ లాబీ’గా వ్యవహరిస్తున్న కోటరీలోని రాజకీయ నాయకులు, మద్యం వ్యాపారులను ప్రశ్నించినప్పుడు లభించిన సమాచారం ఆధారంగా సీబీఐ సిసోడియా కోసం విస్తృతమైన ప్రశ్నావళి తయారుచేసిందని తెలిసింది. ఇదే కేసులో గతేడాది డిసెంబరులో సీబీఐ తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించింది. ఇటీవల కవిత మాజీ చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ తమకు అనుకూలంగా రూపొందేలా కవితతో పాటు ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన పి.శరత్‌ చంద్రా రెడ్డితో కూడిన సౌత్‌ లాబీ మంత్రాంగం నడిపిందని, దాని తరఫున వ్యవహారాన్ని బుచ్చిబాబు చక్కబెట్టాడని సీబీఐ అభియోగం.

Updated Date - 2023-02-27T18:47:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising