Diwali Bonus: ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 20 శాతం దీపావళి బోనస్
ABN , First Publish Date - 2023-11-09T12:38:14+05:30 IST
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉద్యోగులకు 20 శాతం దీపావళి బోనస్(Diwali Bonus) పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం
ప్యారీస్(చెన్నై): రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉద్యోగులకు 20 శాతం దీపావళి బోనస్(Diwali Bonus) పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న సి, డి విభాగాల ఉద్యోగులకు 2022-23వ సంవత్సరానికి సంబంధించిన బోనస్ 8.33 శాతం, ప్రోత్సాహక నిధిగా 11.67 శాతం అని మొత్తం 20 శాతం బోన్‌సగా పంపిణీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా రూ.3 వేల చొప్పున పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జోనళ్లు, ఆధునిక రైస్ మిల్లులు, గిడ్డంగులు, వరి కొనుగోలు కేంద్రాల్లో పని చేస్తున్న 49,023 మందికి రూ.29 కోట్లు బోనస్ రూపంలో అందజేయనున్నట్లు సచివాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.