Diwali: గృహిణులకు ముఖ్యమంత్రి దీపావళి కానుక.. ప్రతి ఒక్కరికీ ఎంతంటే..
ABN , First Publish Date - 2023-11-08T11:10:34+05:30 IST
అప్పీలు చేసుకున్న 8 లక్షల మంది గృహిణులకు ఈనెల 10వ తేది నుంచి వారి బ్యాంక్ ఖాతాల్లో(Bank accounts) రూ1,000 జమ
- అప్పీలు చేసుకున్న 8 లక్షల మందికి రూ.1,000
ప్యారీస్(చెన్నై): అప్పీలు చేసుకున్న 8 లక్షల మంది గృహిణులకు ఈనెల 10వ తేది నుంచి వారి బ్యాంక్ ఖాతాల్లో(Bank accounts) రూ1,000 జమ చేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబరు 15న మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా గృహిణులకు ప్రతినెలా రూ.1,000 పంపిణీ చేసే పథకానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద 1.6 కోట్ల మంది మహిళలకు ప్రతి నెలా 14వ తేదీన వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతోంది. ఈ పథకం కోసం రాష్ట్రప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7 వేల కోట్లు కేటాయించింది. ఇదిలా ఉండగా, రూ.1,000 పొందని గృహిణులు సుమారు 8 లక్షల మందికి పైగా అప్పీలు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు ఈనెల 12న దీపావళి పండుగ జరుపుకోనున్న సందర్భంగా రెండు రోజుల ముందే అప్పీలు చేసుకున్న గృహిణులకు రూ.1,000 వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు వారి సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్ పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ పథకానికి ఎంపికైన గృహిణులకు ఎస్‌ఎంఎస్‌లు పంపే పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు.