Diwali: ప్రారంభమైన దీపావళి రద్దీ.. బయల్దేరిన 3500 ప్రత్యేక బస్సులు
ABN , First Publish Date - 2023-11-10T09:57:25+05:30 IST
దీపావళి పండుగను స్వస్థలాల్లో జరుపుకునేందుకు నగరం నుంచి బయలుదేరే ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, విద్యార్థులు,
చెన్నై, (ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగను స్వస్థలాల్లో జరుపుకునేందుకు నగరం నుంచి బయలుదేరే ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల కోసం గురువారం సాయంత్రం నుంచి రవాణా సంస్థ ప్రత్యేక బస్సులు వివిధ నగరాలకు బయలుదేరాయి. ఈ యేడాది దీపావళి(Diwali) రద్దీ అధికంగా ఉంటుందని భావించిన రాష్ట్ర రవాణా సంస్థ 3500 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు గురువారం సాయంత్రం నగరంలో దక్షిణాది నగరాలకు ఈ బస్సులు బయలుదేరాయి. దీంతో కోయంబేడు బస్‌స్టేషన్ వద్ద సాయంత్రం ఐదు గంటల నుండే ప్రయాణీకుల రద్దీ అధికమైంది. ఇదే విదంగా వివిధ నగరాలకు బయలుదేరిన ఆమ్నీ బస్సులలోనూ ప్రయాణీకుల రద్దీ పెరిగింది. కోయంబేడు నుంచి దక్షిణాది నగరాలకు బయలుదేరిన బస్సులు నజరతేపేట బైపా్‌సరోడ్డు మీదుగా వెళ్లేలా రవాణా అధికారులు చర్యలు చేపట్టారు.