Share News

Diwali: రూ.కోటి విలువైన మేకపోతులు, పొట్టేళ్ల విక్రయం

ABN , First Publish Date - 2023-11-02T13:05:56+05:30 IST

దీపావళి పండుగను పురస్కరించుకుని మేకపోతులు, పొట్టేళ్ల విక్రయం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో

Diwali: రూ.కోటి విలువైన మేకపోతులు, పొట్టేళ్ల విక్రయం

అడయార్‌(చెన్నై): దీపావళి పండుగను పురస్కరించుకుని మేకపోతులు, పొట్టేళ్ల విక్రయం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో ఒకటైన కళ్ళకుర్చి జిల్లా ఉళుందూరుపేట సంతలో మంగళవారం ఏకంగా కోటి రూపాయల మేకపోతులు, పొట్టేళ్లు విక్రమయ్యాయి. ఈ యేడాది దీపావళి పండగ(Diwali festival)కు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఉళుందూరుపేట సంతలో పొట్టేళ్లు, మేకపోతులను కొనుగోలు చేసేందుకు చెన్నై, తిరుచ్చి, సేలం, ధర్మపురి, కడలూరు, విల్లుపురం తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. దీంతో ఈ మార్కెట్‌లో ప్రధాన పండుగల సమయంలో రూ.కోట్లలో వ్యాపారం సాగుతుంది. ఆ విధంగా దీపావళి పండుగకు పొట్టేళ్లు, మేకపోతులను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. ఫలితంగా మంగళవారం ఒక్కరోజే ఏకంగా కోటి రూపాయల మేరకు వ్యాపారం జరిగింది.

Updated Date - 2023-11-02T13:05:58+05:30 IST