ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి పరాభవం.. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాలన్నీ..

ABN, First Publish Date - 2023-05-14T07:35:38+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి తీవ్ర పరాభవం. ఎదురైంది. ఆయన తీవ్ర ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రచారం చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(State BJP president Annamalai)కు పరాభవం ఎదురైంది. ఆయన తీవ్ర ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడంతో పాటు, ‘కో-ఇన్‌చార్జి’గా ఆయన వ్యూహాలు కూడా బెడిసికొట్టాయని పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకేపై తీవ్ర విమర్శలు చేస్తూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోనే కూటమి ఏర్పాటవుతుందని ప్రకటించి కలకలం రేపిన అన్నామలైని ఆ పార్టీ అధిష్ఠానం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కో-ఇన్‌ఛార్జి(Co-in-charge of Karnataka Assembly Elections)గా నియమించింది. దీంతో తన గురువైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీఎల్‌ సంతోష్‏తో కలిసి ఎన్నికల వ్యూహ రచన చేశారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల మేనిఫెస్టో తయారీ, జాతీయ నాయకుల ప్రచార సభల నిర్వహణ వంటి అన్ని పనులను ఆయన భుజాలకెత్తుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో అన్నామలై తీసుకున్న కొన్ని నిర్ణయాలు కర్ణాటక బీజేపీ నేతల్లో అసంతృప్తి రేపాయి. పార్టీకి దశాబ్దాల తరబడి సేవలు చేసినవారికి సీటివ్వకుండా చాలా చోట్ల కొత్తవారికి ఇచ్చారని పార్టీ రాష్ట్ర శాఖ నాయకులు ఆరోపించారు. అన్నామలై వ్యూహరచనతో పార్టీ ఓటమి పాలయ్యే అవకాశముందని పలుమార్లు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు సైతం చేశారు. అయితే అన్నామలైపై విశ్వాసముంచిన అధిష్ఠానం.. ఆయన నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర శాఖ నాయకులు హెచ్చిరించినట్లే కర్ణాటకలో బీజేపీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై ఫార్ములాకు ఎదురుదెబ్బ తగలిందంటూ ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థుల్లో చాలామంది అన్నామలై పట్టుబట్టి మరీ ఎంపిక చేసిన వారేనని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అన్నామలైకు చేదు అనుభవాన్నే మిగిల్చాయని రాష్ట్ర కమలాలయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

Updated Date - 2023-05-14T07:35:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising