Fake Degree Certificate Case: కొట్టాయంలో నిందితుడు నిఖిల్ థామస్ అరెస్ట్..

ABN , First Publish Date - 2023-06-24T09:02:57+05:30 IST

నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ కేసులో నిందితుడు నిఖిల్ థామస్‌ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఐదు రోజులుగా పోలీసులకు చిక్కుండా పరారీలో ఉన్న నిఖిల్‌ను కొట్టాయంలో కాయంకుళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Fake Degree Certificate Case: కొట్టాయంలో నిందితుడు నిఖిల్ థామస్ అరెస్ట్..

కొట్టాయం: నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ కేసులో(Fake Degree Certificate Case) నిందితుడు నిఖిల్ థామస్‌ను(Nikhil Thomas) ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఐదు రోజులుగా పోలీసులకు చిక్కుండా పరారీలో ఉన్న నిఖిల్‌ను కొట్టాయంలో (Kottayam) కాయంకుళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎస్ఎఫ్‌ఐ నాయకుడిగా ఉన్న నిఖిల్ థామస్‌ను నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో జూన్ 20న నిఖిల్ థామస్‌ను ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది.

అలప్పూజా ఎస్ఎం‌ఎస్ కాలేజీలో(Alappuzha MSM College) నకిలీ సర్టిఫికేట్ కేసులో దర్యాప్తు ప్రారంభించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. శనివారం తెల్లవారు జామున కొట్టాయంకు చెందిన నిఖిల్ థామస్‌ను కేఎస్‌ఆర్టీసీ బస్ డిపోలో అదుపులోకి తీసుకున్నారు. నిఖిల్‌ను కాయంకుళం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఫోర్జరీ కేసులో నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంతో గత ఐదు రోజులుగా పరారీలో ఉన్నాడు.

Updated Date - 2023-06-24T09:02:57+05:30 IST