Former Minister: మండిపడ్డ మాజీమంత్రి.. వారి రాజకీయాల కోసం ‘కావేరి’ రైతులకు అన్యాయమా..

ABN , First Publish Date - 2023-09-29T12:54:49+05:30 IST

కావేరి జలాల విషయంలో రాష్ట్రానికి చెందిన రైతుల కంటే రానున్న లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నారని కర్ణాటక టీం- ఎ కాగా తమిళనాడు టీం బీగా

Former Minister: మండిపడ్డ మాజీమంత్రి.. వారి రాజకీయాల కోసం ‘కావేరి’ రైతులకు అన్యాయమా..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కావేరి జలాల విషయంలో రాష్ట్రానికి చెందిన రైతుల కంటే రానున్న లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నారని కర్ణాటక టీం- ఎ కాగా తమిళనాడు టీం బీగా వ్యవహరిస్తోందని జేడీఎస్‌ నేత, మాజీ మంత్రి రేవణ్ణ(JDS leader and former minister Revanna) మండిపడ్డారు. కలబురిగిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలు కలిపి 40 లోక్‌సభ సీట్లు సాధించాలని భావిస్తున్నారన్నారు. వారి రాజకీయాల కోసం కావేరీ ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఆపరేషన్‌ హస్త అనేది కొత్తేమి కాదన్నారు. 1991 నుంచి ఇదే ప్రక్రియ సాగుతూనే ఉందన్నారు. 30 ఏళ్లలో జేడీఎస్‌ ఎప్పుడూ భయపడలేదని, ఇప్పుడు బెదరదని కొట్టిపారేశారు. గతంలో బీజేపీ, జేడీఎస్‏లను ఏటీం, బీటీం అనేవారని కానీ తాము రాష్ట్రంలో రాజకీయాలు చేశామన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌ ఏకంగా తమిళనాడుతో జతకట్టి రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. బీజేపీతో పొత్తు విషయంలో ఎటువంటి గందరగోళం లేదన్నారు. దేవెగౌడ, కుమారస్వామి నిర్ణయమే అంతిమమన్నారు. ఇటీవల కొందరు పార్టీకు రాజీనామా చేస్తున్న విషయమై స్పందిస్తూ జేడీఎస్‌ నుంచి ఎంతోమంది బయటకు వెళ్ళినవారు ఉన్నారని అంతమాత్రాని పార్టీకు వచ్చే నష్టం ఉండదన్నారు.

Updated Date - 2023-09-29T12:54:49+05:30 IST