West Bengal: కోల్‌కతా విమానాశ్రయంలో 4 కొవిడ్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2023-01-05T11:01:02+05:30 IST

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఓమైక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్ 7 నాలుగు కేసులు వెలుగుచూశాయి...

West Bengal: కోల్‌కతా విమానాశ్రయంలో 4 కొవిడ్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 పాజిటివ్ కేసులు
Covid sub variant BF7

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఓమైక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్ 7 నాలుగు కేసులు వెలుగుచూశాయి.(Covid sub variant) కరోనా బారిన పడిన నలుగురు ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పశ్చిమబెంగాల్(West Bengal) ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చిన నలుగురి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌ చేయించగా వారికి కొత్త కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించినట్లు వైద్యాధికారులు తెలిపారు.కరోనా సోకిన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.

ఓ వ్యక్తి నాడియా జిల్లాకు చెందినవారని, మరొకరు బీహార్‌కు చెందినవారని అధికారులు చెప్పారు. కాని ప్రస్తుతం వారు కోల్‌కతాలో నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. కరోనా సోకిన నలుగురితో 33 మంది వ్యక్తులు కలిసినట్లు బెంగాల్ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు.రోగులను కలిసిన వారి పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నామని వైద్యులు చెప్పారు.విదేశాల నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి (Kolkata airport) వచ్చిన కొవిడ్ -19 పాజిటివ్ వ్యక్తులందరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సేకరించారు.గత వారం కోల్‌కతా విమానాశ్రయంలో ఒక విదేశీ పౌరుడితో సహా ఇద్దరు వ్యక్తులకు బీఎఫ్ 7 సబ్‌వేరియంట్‌ సోకినట్లు నిర్ధారించారు.

Updated Date - 2023-01-05T11:01:04+05:30 IST