ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Go First Airlines: 'గో ఫస్ట్' విమాన సర్వీసుల రద్దు మే 30 వరకు పొడిగింపు

ABN, First Publish Date - 2023-05-27T11:59:01+05:30

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గో ఫస్ట ఎయిర్‌లైన్స్ తమ విమాన సర్వీసుల సస్పెన్షన్‌ను మే 30వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఆపరేషనల్ రీజన్స్ కారణంగా మే 30 వరకూ సర్వీసుల సస్పెన్షన్ కొనసాగించాలని నిర్ణయించామని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తమ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది.

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గో ఫస్ట ఎయిర్‌లైన్స్ (Go First Airlines) తమ విమాన సర్వీసుల సస్పెన్షన్‌ను మే 30వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఆపరేషనల్ రీజన్స్ కారణంగా మే 30 వరకూ సర్వీసుల సస్పెన్షన్ కొనసాగించాలని నిర్ణయించామని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తు్న్నామని తమ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. ప్రయాణికులకు తమ పరిధిలో చేయగలిగిన అసిస్టెన్స్ ఇస్తామని, త్వరలోనే టిక్కెట్ సొమ్ము రిఫండ్ చేస్తామని పేర్కొంది. తక్షణ పరిష్కారం, కార్యకలాపాల పునరుద్ధరణ కోసం కంపెనీ ఒక దరఖాస్తును దాఖలు చేసినందని త్వరలోనే బుకింగ్‌లు ప్రారంభిస్తామనే ఆశాభావం వ్యక్తం చేసింది.

కాగా, విమాన సర్వీసుల పునఃప్రారంభానికి సంబంధించిన ప్రణాళికలను 30 రోజుల్లోగా తమకు సమర్పించాలని గో ఫస్ట్‌ను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) మే 24న ఆదేశించింది. కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేందుకు ఎన్ని విమానాలు అందుబాటులో ఉన్నాయి, పైలట్లు, ఇతర సిబ్బంది లభ్యత, నిర్వహణ వసతులు, నిధులు, మూలధనం, విమానాల అద్దె సంస్థలు, వెండర్లతో ఒప్పందాలు వంటి వవరాలను ఆ ప్రణాళికలో పొందుపరచాలని సూచించింది. గోఫస్ట్ మే 3వ తేదీ నుంచి విమాన సర్వీసులను ఆపేసింది. స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసుకుంది. అకస్మాత్తుగా విమాన సర్వీసుల నిలిపివేతపై గో ఫస్ట్‌కు డీజీసీఏ నోటులు పంపగా, 8న గోఫస్ట్ వివరణ ఇచ్చింది. పునరుద్ధరణ ప్రణాళిక రూపకల్పన కోసం మారటోరియం సమయాన్ని ఉపయోగించుకునేందుకు ఇనుమతివ్వాలని డీజీసీఏను గోఫస్ట్ కోరింది.

Updated Date - 2023-05-27T12:01:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising