Indigo Emergency Landing: ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్, కేంద్ర మంత్రి సహా ప్రయాణికులు సురక్షితం

ABN , First Publish Date - 2023-06-04T16:33:32+05:30 IST

డిబ్రూగఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఆదివారంనాడు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలియా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇందులోదులో కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి ప్రయాణిస్తున్నారు.

Indigo Emergency Landing: ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్, కేంద్ర మంత్రి సహా ప్రయాణికులు సురక్షితం

గువాహటి: డిబ్రూగఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో(Indigo plane) ఆదివారంనాడు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని గువాహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలియా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. 6E2652 ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసినప్పుడు అందులో కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి (Rameswar Teli), బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశాంత ఫుకన్, తెరష్ గోవాళ్లతో సహా 150 మంది ప్రయాణిస్తున్నారు.

కాగా, తామంతా సురక్షితంగా ఉన్నట్టు రామేశ్వర్ తేలి ఒక ట్వీట్‌లో తెలిపారు. ప్రస్తుతం గువాహటిలోనే ఉన్నామని, విమానం డిబ్రూడఘ్ విమానాశ్రయానికి మళ్లించడానికి ముందు 15 నుంచి 20 నిమిషాలు గాలిలోనే తాము ఉన్నట్టు చెప్పారు. తనతో పాటు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్నారని, షెడ్యూల్ ప్రకారం దులియాజాన్, టింగ్‌హాంగ్, తీన్‌సుకియాలో మూడు సమావేశాలకు తాము హాజరుకావాల్సి ఉందని చెప్పారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ విషయాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ ధ్రువీకరించింది.

Updated Date - 2023-06-04T17:23:22+05:30 IST