Haryana CM Khattar : వేషము మార్చెను.. జనంలోకి వెళ్లెను!
ABN , First Publish Date - 2023-11-09T04:12:02+05:30 IST
పూర్వం రాజులు మారువేషంలో తిరుగుతూ తమ రాజ్య ప్రజల యోగక్షేమాలను, వారి అభిప్రాయాలను తెలుసుకునేవారట. హరియాణా సీఎం
ముఖానికి స్కార్ఫ్, టోపీతో ఓ మేళాలో కలియతిరిగిన హరియాణా సీఎం ఖట్టర్
పంచకుల, నవంబరు 8: పూర్వం రాజులు మారువేషంలో తిరుగుతూ తమ రాజ్య ప్రజల యోగక్షేమాలను, వారి అభిప్రాయాలను తెలుసుకునేవారట. హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ కూడా మంగళవారం అలాంటి పనే చేశారు. ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని, టోపీ పెట్టుకొని పంచకులలోని ఓ మైదానంలో జరుగుతున్న మేళాలో ఏ మాత్రం సెక్యూరిటీ లేకుండా, వాచ్‌మన్‌లాగా కలియతిరిగారు. అక్కడే చిప్స్ కొనుక్కొని తిన్నారు. కాసేపు ఫోన్ చూస్తూ గడిపారు. ఆయన్ను ఒక్కరు కూడా గుర్తుపట్టలేదు. ఇందుకు సంబంధించిన వీడియో బుధవారం వైరల్ అయింది.