IED recoverd in Assam: ఛత్తీస్‌గఢ్ తరహాలో అసోంలో మందుపాతర.. బలగాల అప్రమత్తతో తప్పిన పెనుముప్పు..
ABN, First Publish Date - 2023-04-26T18:36:54+05:30
ఛత్తీస్‌గఢలోని బస్తర్ జిల్లా దంతేవాడలో మావోయిస్టులు జరిపిన ఘాతకంలో 11 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన గంటల వ్యవధిలోనే..
గౌహతి: ఛత్తీస్‌గఢలోని బస్తర్ జిల్లా దంతేవాడలో మావోయిస్టులు జరిపిన ఘాతకంలో 11 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన గంటల వ్యవధిలోనే అసోంలో (Assam) అనుమానాస్పద ఐఈడీని (IED) కనుగొన్నారు, తీన్‌సుకియాలోని మకుమ్ ప్రాంతంలో కనిపించిన ఐఈడీని భద్రతా బలగాలు సకాలంలో స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేయడంతో భారీ ప్రమాదం తప్పంది. మకుమ్ బైపాస్ రోడ్డులోని ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఈ పేలుడు పదార్ధాన్ని కనుగొన్నారు. ఇండియన్ ఆర్మీ బాంబు స్వ్కాడ్ సహాయంలో సురక్షిత ప్రాంతానికి బ్యాగ్ తరలించి నిర్వీర్యం చేసినట్టు తీన్‌సుకియా ఎస్‌పీ గౌరవ్ అభిజిత్ దిలీప్ తెలిపారు. ఐఈడీ తరహాలో ఉన్న ఈ వస్తువును ఎవరు అమర్చారు, దీని వెనుక ఉద్దేశం ఏమిటనే దానిపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.
కాగా, బుధవారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో నక్సలైట్లు జరిపిన మందుపాతర పేలుడు ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవరు ప్రాణాలు కోల్పోయారు. యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టిన రిజర్వ్ గార్డ్ జవాన్లు మినీ బస్సులో తిరిగివస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనను ఛత్తీస్‌ఢ్ సీఎం భూపేష్ భాఘెల్‌తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తీవ్రంగా ఖండించారు. అమర జవాన్ల కుటుంబాలకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Updated Date - 2023-04-26T18:40:03+05:30 IST