Covid-19 cases: దేశంలో 60వేలు దాటిన యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య
ABN , First Publish Date - 2023-04-17T11:39:04+05:30 IST
దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది...
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.(Covid-19 cases) గడచిన 24 గంటల్లో 9,111 కొత్త కొవిడ్ కేసులు వెలుగుచూడటంతో దేశంలో ప్రస్థుతం యాక్టివ్ కేసుల సంఖ్య 60వేల మార్కు దాటింది.దేశంలో సోమవారం నాటి యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కు చేరుకుందని(Active caseload crosses 60,000 mark) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ( Health Ministry) తెలిపింది. రోజువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు 8.40 శాతంగా రికార్డు అయింది. దేశంలో ప్రబలిన కరోనా కేసుల సంఖ్యలో 0.13 శాతం యాక్టివ్ కొవిడ్ వైరస్ కేసులున్నాయి.
ఇది కూడా చదవండి : Karnataka: మనస్ఫూర్తిగా కాంగ్రెస్ చేరుతున్నా...మాజీ సీఎం జగదీష్ షెట్టార్
దేశంలో గడచిన 24 గంటల్లో కరోనాతో 27 మంది మరణించారు. గుజరాత్ రాష్ట్రంలో ఆరుగురు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు, రాజస్థాన్, ఢిల్లీలలో ముగ్గురు చొప్పున, మహారాష్ట్రలో ఇద్దరు, తమిళనాడు, కేరళ, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ వల్ల మొత్తం మరణాల సంఖ్య 5,31,141 కి పెరిగింది. గత 24 గంటల్లో 6,313 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. కరోనా సోకినా 98.68 శాతం మంది కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా వల్ల మరణాల శాతం 1.18 శాతం అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.