ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంపై పెట్టిన డబ్బు వృధానా? దీని వల్ల ప్రయోజనం ఎంత?

ABN, First Publish Date - 2023-08-23T21:39:11+05:30

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. 140 కోట్ల భారతీయుల కలల్ని సాకారం చేస్తూ.. ఇది బుధవారం సాయంత్రం 6:03 గంటలకు జాబిల్లిపై...

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. 140 కోట్ల భారతీయుల కలల్ని సాకారం చేస్తూ.. ఇది బుధవారం సాయంత్రం 6:03 గంటలకు జాబిల్లిపై అడుగుపెట్టింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి, ఇంతవరకు ఏ దేశం సాధించని ఘనతని కైవసం చేసుకుంది. భారత వైజ్ఞానిక సంత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. నిజానికి.. దక్షిణ దృవంపై కాలు మోపడమన్నది.. అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు కూడా అందని ద్రాక్ష వంటిది. అలాంటి కఠినమైన చోట చంద్రయాన్-3 కాలుమోపి.. సరికొత్త చరిత్రను సువర్ణక్షరాలతో రాసింది. దీంతో.. యావత్ భారతావని మనసు గర్వంతో ఉప్పొంగుతోంది.


ఆ సంగతులు అలా ఉంచితే.. ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్‌పై ఎంత ఖర్చు వెచ్చించారో తెలుసా? 2020లో అప్పటి ఇస్రో ఛైర్మన్ కే శివన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చంద్రయాన్-3 బడ్జెట్ 615 కోట్లు. మరి.. ఇంత డబ్బు వెచ్చించడం విలువైనదేనా? ఆ డబ్బంతా వృధా అయినట్టా లేక ప్రయోజనం చేకూరినట్టా? ఇక్కడే మనం కొన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న భాగల్‌పూర్ బ్రిడ్జ్ కూలిన ఘటన గుర్తుందా? ఆ బ్రిడ్జ్ బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల రూ.1,710 కోట్లు. అంటే.. చంద్రయాన్-3తో పోలిస్తే ఆ బ్రిడ్జ్ బడ్జెట్ మూడింతలు ఎక్కువ. కానీ.. చివరికి ఏమైంది? బ్రిడ్జ్ కూలిపోవడంతో ఆ డబ్బంతా వృధా అయ్యింది. కానీ.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం అవ్వడం వల్ల మన భారతదేశం ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పినట్టయ్యింది. దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి.. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాలకు సవాల్ చేసినట్టయ్యింది. తాము తలచుకుంటే ఏమైనా సాధించగలమని నిరూపించగలిగింది.

అంతెందుకు.. మన చంద్రయాన్-3 కంటే ముందు చంద్రుడిపై కాలు మోపాలన్న ఉద్దేశంతో రష్యా దేశం పంపించిన లూనా-25 స్పెస్‌క్రాఫ్ట్ బడ్జెట్ ఎంతో తెలుసా? రూ.1600 కోట్లు. కానీ.. అది చంద్రుడి ఉపరితలంపై చేరగానే కుప్పకూలింది. చివరికి.. ఈ ఏడాదిలో విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన ఆదిపురుష్ బడ్జెట్ ఈ చంద్రయాన్-3 కంటే ఎక్కువ. ఆ సినిమాని రూ.700 కోట్లతో నిర్మించారు. కానీ.. దాని ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. బొమ్మల సినిమాగా రూపొందడంతో.. దానిపై సర్వత్రా విమర్శలొచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. కొన్ని వేల కోట్ల నష్టాలు మిగిల్చిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. వాటితో పోలిస్తే.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ బడ్జెట్ అగ్గిపెట్టెలోని ఒక పుల్లంత. కానీ.. ఇప్పుడదే అగ్గిపుల్ల రగిలి, చంద్రుడి దక్షిణ జాడల్ని ప్రపంచాన్ని చూపించింది. ఆ ఒక్క వెలుగు.. ప్రతి భారతీయుడ్ని గర్వంగా తలెత్తుకునేలా చేసింది. కాబట్టి.. చంద్రయాన్-3పై ఖర్చు చేసిన ప్రతీ పైసా ఎంతో విలువైనదని చెప్పుకోవచ్చు.

Updated Date - 2023-08-23T21:50:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising