Karnataka: సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్...ప్రభుత్వ టీచర్ సస్పెన్షన్
ABN , First Publish Date - 2023-05-22T13:36:14+05:30 IST
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్ షేర్ చేసిన కొద్ది నిమిషాలకే కర్ణాటక స్కూల్ టీచర్ సస్పెండ్ అయ్యారు...
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్ షేర్ చేసిన కొద్ది నిమిషాలకే కర్ణాటక స్కూల్ టీచర్ సస్పెండ్ అయ్యారు.(Karnataka school teacher suspended)కర్ణాటకలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం సిద్ధరామయ్యను విమర్శిస్తూ శాంతమూర్తి అనే టీచర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.(sharing post criticising Siddaramaiah govt)చిత్రదుర్గంలోని హొసదుర్గంలోని కానుబెన్నహళ్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఎంజీ శాంతమూర్తి అనే ఉపాధ్యాయుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపైనా, ఉచిత పథకాలపైనా విమర్శలు గుప్పించారు.‘‘ఒకప్పుడు రైట్ వింగ్ గా భావించే కర్ణాటక కొత్త సీఎం సిద్ధరామయ్య పాత యుద్ధ గుర్రంఫ్రీబీస్ ఇవ్వకుండా ఇంకేం చేయగలం’’ అని శాంతమూర్తి ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. తన పోస్ట్‌లో పాఠశాల ఉపాధ్యాయుడు వివిధ ముఖ్యమంత్రుల హయాంలో చేసిన అప్పును పేర్కొన్నాడు.దీనిపై శాంతమూర్తిని సస్పెండ్ చేస్తూ క్షేత్ర విద్యాశాఖాధికారి ఎల్.జయప్ప ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడు శాంతమూర్తి ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో విద్యాశాఖాధికారి పేర్కొన్నారు.