Kerala: కొవిడ్‌తో పొంచి ఉన్న ప్రమాదం.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ABN, First Publish Date - 2023-01-16T21:11:25+05:30
కరోనాతో ప్రమాదం పొంచి ఉండటంతో కేరళ ప్రభుత్వం(Kerala Goverment) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
తిరువనంతపురం: కరోనాతో ప్రమాదం పొంచి ఉండటంతో కేరళ ప్రభుత్వం(Kerala Goverment) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో(Public places) ప్రజలకు మాస్క్ తప్పనిసరి(Mask Mandatory) చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల్లో, వేడుకల్లోనూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని స్పష్టం చేసింది. కొవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలు భౌతిక దూరం(Social Distancing) నియమాన్ని పాటించాలనీ సూచించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. షాపులు, థియేటర్లు, వివిధ ఈవెంట్లను నిర్వహించే వారందరూ తమ కస్టమర్లకు శానిటైజర్లు(Sanitizer) ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలి. ఈ ఆదేశాలు రాష్ట్రమంతటా రాబోయే 30 రోజుల పాటు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
సోమవారం దేశవ్యాప్తంగా 114 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే.. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2119కి దిగింది. కొవిడ్ రికవరీ రేటు జాతీయ సగటు 98.80 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. జీనోమిక్స్ కన్సార్షియమ్ డాటా ప్రకారం.. దేశంలో ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ కేసుల సంఖ్య 26కు చేరుకుంది. దేశరాజధాని ఢిల్లీతో పాటూ మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ బయటపడింది.
Updated Date - 2023-01-16T21:14:17+05:30 IST