ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sukhdev Singh Gogamedi: సుఖ్‌దేవ్ సింగ్‌ని చంపింది మేమే.. లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడి పోస్టు వైరల్

ABN, First Publish Date - 2023-12-05T19:54:36+05:30

దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన రోహిత్ గోదారా అనే వ్యక్తి..

Sukhdev Singh Gogamedi Killing: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన రోహిత్ గోదారా అనే వ్యక్తి ఈ హత్యకు బాధ్యత వహించాడు. తమ శత్రువులతో సుఖ్‌దేవ్‌కు సంబంధాలు ఉండేవని, వారికి సహకరించేవాడని.. అందుకే తాము అతడ్ని టార్గెట్ చేసి చంపేశామని సోషల్ మీడియాలో ఒక పోస్టులో అతడు రాసుకొచ్చాడు. ఈ హత్యకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని పేర్కొన్నాడు.

‘‘సోదరులందరికీ నమస్కారం. నా పేరు రోహిత్ గోదార కపురిసార్. మంగళవారం జరిగిన సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు మేము పూర్తి బాధ్యత వహిస్తాము. అతడు మన శత్రువులను కలుసుకుని వారికి సహకరించేవాడని, వారిని పూర్తిగా బలపరిచేవాడని మాకు సమాచారం అందింది. అందుకే.. అతడ్ని చంపేశాం. ఇక మన శత్రువుల విషయానికొస్తే, మీరు ఇంటి గుమ్మం ముందే మీ శవపేటికల్ని సిద్ధం చేసుకొని ఉంచుకోండి. త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటాం’’ అంటూ రోహిత్ తన పోస్టులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అటు.. పోలీసులు సైతం రంగంలోకి దిగి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ హత్య వెనుక ఎవరున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.


కాగా.. డిసెంబర్ 5వ తేదీన జైపూర్‌లో సుఖ్‌దేవ్ సింగ్‌ను ఇద్దరు దుండగులు అతని నివాసంలోనే తుపాకీలతో కాల్చి చంపారు. ఈ కాల్పుల ఘటనలో సుఖ్‌దేవ్ అంగరక్షకుడు కూడా గాయపడ్డాడు. అలాగే.. ఎదురుకాల్పుల్లో నవీన్ సింగ్ షెకావత్ అనే దుండగుడు హతమయ్యాడు. ఈ కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దుండగులు కాల్పులు జరిపిన వెంటనే గోగమేడిని మెట్రో మాస్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దాడికి పాల్పడిన నిందితుల్ని తాము గుర్తించామని, అతనికి కూడా గాయాలయ్యాయని జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ వెల్లడించారు.

జైపూర్ పోలీస్ కమీషనర్ ప్రకారం.. ముగ్గురు నిందితులు సెక్యూరిటీ గార్డు ద్వారా సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి అనుమతిని తీసుకుని ఇంట్లోకి ప్రవేశించారు. వారిని కలవడానికి అనుమతించిన తర్వాత, వారు గదిలోకి ప్రవేశించి, సోఫాలో కూర్చుని, కర్ణి సేన చీఫ్‌తో సుమారు 10 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ తర్వాత వారు గోగమేడిపై కాల్పులు జరిపారు. నిందితులు ఎస్‌యూవీ కారులో వచ్చారని, అందులో బ్యాగ్, మద్యం బాటిల్, ఖాళీ గ్లాసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం సహాయంతో కాల్పులు జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. మరోవైపు.. ఈ హత్యకు వ్యతిరేకంగా జైపూర్‌లోని ఆసుపత్రి వెలుపల రాజ్‌పుత్ సంఘం సభ్యులు నిరసన తెలిపారు.

Updated Date - 2023-12-05T19:54:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising