ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Legislative Sessions: అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత గైర్హాజరు

ABN, First Publish Date - 2023-02-11T12:08:43+05:30

శాసనసభ సమావేశాల వేళ ప్రతిపక్షనేత హోదాలో గవర్నర్‌ను సాదరంగా స్వాగతించడంతో పాటు వీడ్కోలు వేళ తప్పనిసరిగా పాల్గొనాలనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): శాసనసభ సమావేశాల వేళ ప్రతిపక్షనేత హోదాలో గవర్నర్‌ను సాదరంగా స్వాగతించడంతో పాటు వీడ్కోలు వేళ తప్పనిసరిగా పాల్గొనాలనే ప్రొటోకాల్‌కు సిద్దరామయ్య(Siddaramaiah) దూరంగా ఉన్నారు. శాసనసభ సమావేశాలు శుక్రవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ను సంప్రదాయబద్దంగా శాసనసభ స్పీకర్‌, పరిషత్‌ సభాపతి, ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్షనేత ఆహ్వానించాల్సి ఉండేది. సభ నుంచి నిష్క్రమించే వేళ కూడా ఇదే విధానం కొనసాగాల్సి ఉండేది. గవర్నర్‌(Governor) కోసం ప్రత్యేకంగా రెడ్‌కార్పెట్‌ ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్‌ విధానసౌధ ప్రాంగణంలోకి చేరుకోగానే ప్రత్యేక పోలీసు బలగాలు, బుల్లెట్‌ వాహనాలు, గుర్రాలపై స్వారీ చేస్తూ స్వాగతించారు. హైకోర్టు వైపు ఉండే ప్రధాన ద్వారం గుండా రెడ్‌కార్పెట్‌పై గవర్నర్‌ అసెంబ్లీ ప్రాంగణంలోకి చేరుకున్నారు. గవర్నర్‌ను శాసనసభ స్పీకర్‌ విశ్వేశ్వరహెగ్డే కాగేరి, పరిషత్‌ సభాపతి బసవరాజ్‌హొరట్టి, ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సాదరంగా స్వాగతించారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉన్నందున శాసనసభ సమావేశాలకు గైర్హాజరయ్యారు. శుక్రవారం బెంగళూరు నుంచి కలబురగికి విమానంలో బయలుదేరారు. జిల్లాలోని సురపురలో బహిరంగ సభలో పాల్గొని ఆ తర్వాత శెహపురలో ఏర్పాటు చేసిన ప్రజాధ్వని సభల్లో భాగస్వాములయ్యారు. సాయంత్రం కలబురిగి పట్టణ పరిధిలోని ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల సంయుక్త కార్యకర్తల సభలో పాల్గొన్నారు. రాత్రికి అక్కడే బసచేశారు. శాసనసభ సమావేశాల తొలిరోజే ప్రతిపక్షనేత పాల్గొనకపోవడం పలు విమర్ళలకు దారితీసింది.

ఇదికూడా చదవండి: సెలబ్రిటీలు సంయమనంతో మెలగాలి

Updated Date - 2023-02-11T12:08:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising