ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sunil kedar disqualified: ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ మాజీ మంత్రి

ABN, Publish Date - Dec 24 , 2023 | 05:36 PM

నాగపూర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి సునీల్ కేదార్‌‌ మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి అనర్హతకు గురయ్యారు. రాష్ట్ర లెజిస్లేటివ్ సెక్రటేరియట్ ఈ మేరకు గెజిట్ ఉత్తర్వు జారీ చేసింది.

నాగ్‌పూర్: నాగపూర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు (NDCCB)లో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర (Maharashtra) మాజీ మంత్రి సునీల్ కేదార్‌‌ (Sunil kedar) మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి అనర్హతకు (disqualified) గురయ్యారు. రాష్ట్ర లెజిస్లేటివ్ సెక్రటేరియట్ ఈ మేరకు గెజిట్ ఉత్తర్వు జారీ చేసింది. భారత రాజ్యాంగంలోని 19(1) అధికరణ, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 కింద... ఎమ్మెల్యేను దోషిగా నిర్ధారించిన డిసెంబర్ 22 నుంచి ఆయన సభ్యత్వంపై అనర్హత వేటు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఎమ్మెల్యే దోషిగా నిరూపణైన తేదీ నుంచి ఆయన ఎన్నికైన సావనేర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు ఖాళీ అయినట్టు స్పష్టం చేసింది.


2002 కేసు..

2002లో ఎన్‌డీసీసీబీ నిధుల దుర్వినియోగం కేసులో కేదార్, మరో ఐదుగురిని నాగపూర్ మెజిస్ట్రేట్ కోర్టు గత శుక్రవారంనాడు దోషులుగా నిర్ధారించింది. వారికి ఐదేళ్ల చొప్పన కఠిన కారాగార శిక్ష, రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేదార్‌ ఎన్‌డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నప్పుడు హోమ్ ట్రేడ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ద్వారా నిధులను పెట్టుబడి పెట్టేటప్పుడు నిబంధనలను ఉల్లంఘించారు. దీనితో ఎన్‌డీసీసీబీ ప్రభుత్వ సెక్యూరిటీలలో రూ.125 కోట్లను కోల్పోయింది.

Updated Date - Dec 24 , 2023 | 05:38 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising