ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Opposition Meeting: స్టాలిన్‌కు ఖర్గే ఫోన్... విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే యత్నం..!

ABN, First Publish Date - 2023-04-07T14:56:02+05:30

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను సమీకరించేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో సమావేశానికి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narnedra Modi) ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను సమీకరించేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో సమావేశానికి కాంగ్రెస్ (Congress) పార్టీ వ్యూహరచన సాగిస్తోంది. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాన్ని ఉద్దేశించింది. ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు (MK Stalin) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఫోన్ చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. ప్రతిపాదిత సమావేశానికి హాజరుకావాలని స్టాలిన్‌ను ఖర్గే ఆహ్వానించినట్టు చెబుతున్నారు. తమిళనాడులోనూ, జాతీయ స్థాయిలోనూ డీఎంకే, కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. విపక్షాల సమావేశం ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ ప్లాన్‌‌కు డీఎంకే మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది.

తేదీ, వేదిక ఎప్పుడు?

కాగా, కాంగ్రెస్ ప్రతిపాదిత విపక్షాల సమావేశం ఎప్పుడు, ఎక్కడ అనేది ఇంకా ఖరారు కాలేదు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, వామపక్షాలతో సహా పలు విపక్ష పార్టీల నుంచి సమాధానం కోసం కాంగ్రెస్ వేచిచూస్తోంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో దేశ రాజకీయాలపై గట్టి పట్టు సాధించి, విపక్షాలను వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో మట్టికరిపించారు. అయితే మెజారిటీ ఓటును రాబట్టుకోలేకపోయింది. దీంతో ఐక్య విపక్ష కూటమి ఏర్పడితే బీజేపీ ఈసారి చిక్కుల్లో పడే అవకాశాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రాహుల్‌ గాంధీకి ఇటీవల పరువునష్టం కేసులో శిక్ష పడటం, ఆ వెంటనే పార్లమెంటు సభ్యత్వంపై వేటుపడటం వంటి పరిణామాలతో విపక్షాలు ఏకతాటిపైకి వస్తున్న సంకేతాలు కనిపించాయి. రాహుల్‌ గాంధీపై సూరత్ కోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే 14 రాజకీయ పార్టీలు సంయుక్తంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. కేంద్ర ఏజెన్సీలు విపక్షాలను లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆ పిటిషన్‌లో విపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ పిటిషన్‌ను పరిశీలనకు స్వీకరించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించారు.

14 పార్టీల ఓటంగ్ శాతం ఎంతంటే..?

2019 సార్వత్రిక ఎన్నికల్లో 14 విపక్ష పార్టీలు 39 శాతం ఓటింగ్ సాధించాయి. 542 పార్లమెంటు స్థానాల్లో 160 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ ఒక్కటే 38 శాతం ఓట్లు సాధించి 303 సీట్లు గెలుచుకుంది. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న మోదీ, ఇప్పటికీ పాపులారిటీ విషయంలోనూ ఆమోదయోగ్యమైన రేటింగ్‌లో ఉన్నారు. విపక్షాల ఐత్యత ఇంతవరకూ సాకారం కాని నేపథ్యంలో మూడోసారి ఆయన ఎన్నిక కూడా సులభ సాధ్యమేనన్న అంచనాలున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం గత నెలలో విపక్షాల ఐక్య కూటమికి పిలుపునిచ్చారు. 2024లో బీజేపీని ఐక్య ప్రతిపక్ష కూటమితోనే ఎదుర్కోవాలని ఆమె చెప్పారు. అయితే, ఇంతకుముందు తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు.

Updated Date - 2023-04-07T14:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising