Delhi Excise Case : సిసోడియా ప్రాణాలకు ముప్పు: ఆప్

ABN , First Publish Date - 2023-03-08T14:48:14+05:30 IST

ఢిల్లీ ఎక్సైజ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రాణాలకు..

Delhi Excise Case : సిసోడియా ప్రాణాలకు ముప్పు: ఆప్

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కేసు (Delhi excise case)లో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తీహార్ జైలులో సిసోడియాను ప్రమాదకరమైన నేరస్థులతో కలిపి ఉంచినట్టు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ చెప్పారు. హోలీ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, సిసోడియాకు విపాసన (Vipassana) సెల్ కూడా నిరాకరించేంతటి పగ 'ఆమ్ ఆద్మీ పార్టీ'పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉందని ఆరోపించారు. ప్రస్తుతం సిసోడియాను జైలులో అత్యంత కిరాతకులైన నేరస్థుల మధ్య ఉంచినట్టు చెప్పారు. లక్షలాది మంది పిల్లలకు మంచి విద్య అందించాలని అనుకోవడమే సిసోడియా చేసిన ఏకైక నేరమని అన్నారు.

కోర్టు మాట కూడా లేక్కలేదు..

మరోవైపు, ఆప్ జాతీయ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ సైతం మనీస్ సిసోడియాకు జైలులో మెడిటేషన్ సెల్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. తనను మెడిటేషన్‌ సెల్‌లో ఉంచాలని సిసోడియా చేసిన విజ్ఞప్తికి కోర్టు కూడా సమ్మతి తెలిపిందని, కోర్టు ఆమోదించినప్పటికీ ఆయనను జైలు నెబర్-1లో ఉంచారని, దీనికి కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆయన నిలదీశారు.

కాగా, సిసోడియాకు జైలు నెంబర్-1లోని సీనియర్ సిటిజన్స్ సెల్‌లో ఉంచారు. ఆయన తనతో పాటు భగవద్గీత, కళ్లజోడు, మందులు తీసుకువెళ్లేందుకు కోర్టు అనుమతించింది. విపాసనా మెడిటేషన్‌లో ఉంచాలన్న సిసోడియా అభ్యర్థను జైలు అధికారులు పరిశీలించాలని కూడా కోర్టు అదేశించింది. తీహార్ జైలుకు తరలించిన సిసోడియాను అక్కడే ఈడీ అధికారులు ఢిల్లీ ఎక్సైజ్ కేసులో మనీలాండరింగ్ కోణం నుంచి మంగళవారంనాడు ప్రశ్నించారు. ఈ కేసులో సిసోడియా సన్నిహితుడు (పీఎస్) దేవేందర్ శర్మను కూడా సీబీఐ ప్రశ్నించింది. కాగా, సిసోడియా బెయిలు పిటిషన్‌ ఈనెల 10న విచారణకు రానుంది.

Updated Date - 2023-03-08T14:48:14+05:30 IST