ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manish Sisodia: మెడిటేషన్ సెల్‌ కోరిన సిసోడియా.. భగవద్గీతకు కోర్టు అనుమతి

ABN, First Publish Date - 2023-03-06T16:38:02+05:30

లిక్కర్ పాలసీ స్కామ్‌లో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు ప్రత్యేక కోర్టు సోమవారంనాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్ (Liquor policy Scam)లో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)కు ప్రత్యేక కోర్టు సోమవారంనాడు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను తీహార్ జైలు (Tihar Jail)కు తరలించారు. జైలులో ఆయనకు 'భగవద్గీత' (Bhagawat Gita)ను కోర్టు అనుమతించింది. 'మెడిటేషన్ సెల్'కు అనుమతించాలని కూడా కోర్టును సిసోడియా కోరారు.

సిసోడియా సీబీఐ కస్టడీ సోమవారంనాడు ముగుస్తుండటంతో ఆయనను రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు మధ్యాహ్నం హాజరుపరిచారు. ఆయన కస్టడీ పొడిగింపును సీబీఐ కోరకపోవడంతో ఈనెల 20వ తేదీ వరకూ ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ ఆదేశాలిచ్చారు. వైద్య పరీక్షల్లో వైద్యులు సూచించిన మందులతో పాటు, కళ్లజోడు, డైరీ, ఒక పెన్ను, భగవద్గీత ప్రతిని సిసిడోయా తనతో తీసుకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. తనను మెడిటేషన్ సెల్‌లో ఉంచాలంటూ సిసోడియా చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.

కాగా, ఇప్పటికే తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 28న సిసోడియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తొలుత హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణను మార్చి 10న చేపడతామని కోర్టు తెలిపింది. మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మార్చి 10న సీబీఐ సమాధానం ఇవ్వనుంది.

Updated Date - 2023-03-06T16:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising