Mask: ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిందే..
ABN , First Publish Date - 2023-04-07T08:55:55+05:30 IST
ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించి స్వీయరక్షణ పాటించాలని చెంగల్పట్టు(Chengalpattu) ప్రభుత్వ కళాశాల ఆసుపత్రి డీన్ నారాయణస్వామి(Narayana S
పెరంబూర్(చెన్నై): ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించి స్వీయరక్షణ పాటించాలని చెంగల్పట్టు(Chengalpattu) ప్రభుత్వ కళాశాల ఆసుపత్రి డీన్ నారాయణస్వామి(Narayana Swamy) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు, బంధువులు, వైద్యులు, నర్సులు, సిబ్బంది తప్పక మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం చెంగల్పట్టు జిల్లాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. కరోనా నియంత్రణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేలా గురువారం చెంగల్పట్టు ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రికి మాస్క్ ధరించకుండా వచ్చిన రోగులకు ఆసుపత్రి డీన్ నారాయణస్వామి స్వయంగా మాస్క్‌లు ధరింపజేశారు.