Assam: అసోం మార్కెట్‌లో ఘోర అగ్నిప్రమాదం...150 దుకాణాలు దగ్థం
ABN , First Publish Date - 2023-02-17T07:14:48+05:30 IST
అసోం రాష్ట్రంలోని జొర్హాత్ మార్కెట్‌లో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం...
జొర్హాత్ (అసోం): అసోం రాష్ట్రంలోని జొర్హాత్ మార్కెట్‌లో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది.(Assam) జొర్హాత్ నగరంలోని చౌక్ బజార్ మార్కెటులో గురువారం రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 150 దుకాణాలు దగ్థం అయ్యాయి.(Massive Fire Breaks Out) ఓ వస్త్రాల దుకాణంలో రాజుకున్న మంటలు మార్కెట్ అంతటా వ్యాపించాయి. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందగానే 25 అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన వచ్చి మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. బట్టల దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్(short circuit) వల్ల అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు.
రాత్రివేళ దుకాణాలు మూసివేసి దుకాణదారులు ఇళ్లకు వెళ్లడంతో ప్రాణనష్టం లేదు.మంటలను ఆర్పేందుకు టీటాబోర్, మరియానీ, గోలాఘాట్ జిల్లాల నుంచి అగ్నిమాపక వాహనాలను రప్పించారు.మార్కెటులో జరిగిన అగ్నిప్రమాదంతో కోట్లాదిరూపాయల ఆస్తి నష్టం జరిగింది.(Shops Destroyed) జొర్హాత్ నగరంలో రెండు నెలల్లో రెండో అగ్నిప్రమాదం జరిగింది. గత ఏడాది డిసెంబరులో మార్వారీ పట్టి ఏరియాలో జరిగిన అగ్నిప్రమాదంలో పలు దుకాణాలు దగ్థం అయ్యాయి.