ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arvind Kejriwal: సీబీఐ అధికారులలో ఎక్కువమంది... అంటూ సీఎం సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-27T14:00:39+05:30

లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆందోళనలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)ను సీబీఐ (CBI) అరెస్టు చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆందోళనలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో కొంత మంది రాజకీయవేత్తల నుంచి వచ్చిన ఒత్తడి కారణంగానే సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్టు చేశారంటూ 'ఆప్' కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారంనాడు సంచలన ట్వీట్ చేశారు. సీబీఐ అధికారుల్లో ఎక్కువ మందికి సిసోడియాను అరెస్టు చేయడం ఇష్టం లేదని చెప్పారు.

''సీబీఐ అధికారుల్లో చాలామందికి సిసోడియాను అరెస్టు చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. వారందరికీ సిసోడియా అంటే చాలా గౌరవం ఉంది. అదీగాక సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు. కానీ, అధికారులపై పొలిటకల్ మాస్టర్ల ఒత్తడి తీవ్రంగా ఉండటంతో వారు తలవంచక తప్పలేదు'' అని కేజ్రీవాల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

లిక్కర్ స్కామ్‌లో సిసోడియాను ఆదివారంనాడు సుమారు 8 గంటల సేపు ప్రశ్నించిన సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. గత ఏడాది అప్పటి ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తర్వాత అరెస్ట్ తర్వాత అవినీతి ఆరోపణలపై అరెస్టయిన 'ఆప్' రెండో పెద్ద నాయకుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కావడం విశేషం. సిసోడియా సమాధానాలతో సీబీఐ విచారణాధికారులు సంతృప్తిగా లేరని, దర్యాప్తునకు ఆయన సహకరించకపోవడమే కాకుండా, కీలక పాయింట్లపై వివరణ విషయంలో మొండికేసినట్టు దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ కారణంగానే ఆయనను అరెస్టు చేసినట్టు పేర్కొంది. సిసోడియా అరెస్టు నియంతృత్వానికి పరాకాష్ట అని, ఇది ప్రజాస్వామ్యానికి చీకటి దినమని 'ఆప్' మండిపడింది. సోసిడియో అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతామని తెలిపింది. రాజకీయ కక్షతోనే బీజేపీ ఈ ప్రతికార దాడికి పాల్పడిందని ఆరోపించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్యను దేవుడు కూడా క్షమించడంటూ తీవ విమర్శలు గుప్పించింది.

Updated Date - 2023-02-27T14:02:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising