MP: బీజేపీ నేతపై క్రిమినల్‌ కేసు వేస్తా!

ABN , First Publish Date - 2023-05-04T10:28:52+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)పై క్రిమినల్‌ కేసు దాఖలు చేయనున్నట్లు

MP: బీజేపీ నేతపై క్రిమినల్‌ కేసు వేస్తా!

చెన్నై, (ఆంధ్రజ్యోతి): అక్రమార్జనకు పాల్పడినట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)పై క్రిమినల్‌ కేసు దాఖలు చేయనున్నట్లు డీఎంకే కోశాధికారి, ఎంపీ టీ.ఆర్‌.బాలు(MP TR Balu) ప్రకటించారు. స్థానిక పల్లావరం శాసనసభ నియోజకవర్గం పమ్మల్‌ ప్రాంతానికి చెందిన డీఎంకే కార్యనిర్వాహకుల సమావేశం ఎస్‌ఎస్‌ మహల్‌లో బుధవారం ఉదయం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రాంతీయ కార్యదర్శి వి.కరుణానిధి, రాష్ట్రమంత్రి దామో అన్బరసన్‌, పల్లావరం ఎమ్మెల్యే ఇ. కరుణానిధి, తాంబరం మేయర్‌ వసంతకుమారి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత టీఆర్‌ బాలు మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై పనిగట్టుకుని డీఎంకే మంత్రులు, ఎంపీలు అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు అస్యత ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తన పేరిట 21 కంపెనీలున్నాయని అన్నామలై చేసిన ఆరోపణ అవాస్తమని, వాస్తవానికి తాను మూడు కంపెనీలలో మాత్రమే భాగస్వామిగా ఉన్నానే తప్ప ఏ కంపెనీకి తాను యజమాని కాదని టీఆర్‌ బాలు స్పష్టం చేశారు. అంతేకాకుండా డీఎంకే మంత్రులు, తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆస్తుల వివరాలను సమర్పించామని, ఆ వివరాలు అవాస్తవాలైతే ఎన్నికల సంఘం అధికారులు, ఐటీ అధికారులు తమపై కఠిన చర్యలు తీసుకునేవారని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ తనపై దుష్ప్రచారం సాగిస్తున్న అన్నామలైని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే లాయర్‌ నోటీసు జారీ చేశానని, ఈ నెల 8న క్రిమినల్‌ కేసు దాఖలు చేస్తానని టీఆర్‌ బాలు ప్రకటించారు.

Updated Date - 2023-05-04T10:28:52+05:30 IST