COVID-19: 78 రోజులు తర్వాత ముంబైలో తొలి కరోనా మరణం నమోదు
ABN , First Publish Date - 2023-04-06T17:21:17+05:30 IST
78 రోజులు తర్వాత ముంబై(Mumbai)లో తొలి కరోనా మరణం
ముంబై: 78 రోజులు తర్వాత ముంబై(Mumbai)లో తొలి కరోనా మరణం నమోదైంది. 69 ఏళ్ల వృద్దుడు జ్వరం, పొడి దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో మార్చి 15న చికిత్స కోసం వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. అతనికి మార్చి 27 న కోవిడ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని, చికిత్సకోసం సెవెన్‌హిల్స్ ఆసుపత్రి(Sevenhills Hospital)కి తరలించామని వైద్యులు వెల్లడించారు. కోవిడ్ ఇన్‌ఫెక్షన్(covid-19 infection)తో కార్డియాక్ షాక్, కిడ్నీకి గాయం(Kidney Injury) కారణంగా అతడు మృతిచెందాడని బీఎంసీ ( Brihanmumbai Municipal Corporation) ఆరోగ్య అధికారి తెలిపారు.
తాజా కోవిడ్ -19 రిపోర్టు (Covid-19 Report) ప్రకారం ముంబైలో బుధవారం 221 కొత్త కేసులు నమోదయ్యాయి. 204 మంది రోగులు కోవిడ్ చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ముంబై నగరంలో 1,244 యాక్టివ్ కేసులు(Active Cases) ఉన్నాయి. 80 మంది రోగులు ఆసుపత్రిలో ఉన్నారు.
అయితే మహారాష్ట్రలో 569 కొత్త కేసులు, రెండు మరణాలతో(Two deaths) నమోదయ్యాయి. వాటిలో ఒకటి ముంబైలో కాగా.. మరొకటి పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్(Pimpri Chinchwad Municipal Corporation)లో నమోదైంది. మహారాష్ట్రలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,874కి చేరింది.
కోవిడ్ కేసులు తగ్గించేందుకు తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నామని BMC ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మంగళ గోమారే తెలిపారు. RTPCR పాజిటివ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతున్నామని తెలిపారు. అయితే సతారాజిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నందున మాస్క్‌లు తప్పనిసరి చేశామని ఆమె తెలిపారు. పబ్లిక్ ప్లేస్‌లలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రజలకు గొమారె సూచించారు. ఏవైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని కోరారు.