Narasapuram-Bangalore: నరసాపురం-బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లు.. ఇవి ఎక్కడెక్కడ ఆగుతాయంటే..
ABN , First Publish Date - 2023-06-08T11:17:00+05:30 IST
ఆంధ్ర రాష్ట్రం నరసాపురం నుంచి బెంగళూరు(Narasapuram to Bangalore)కు వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తె
పెరంబూర్(చెన్నై): ఆంధ్ర రాష్ట్రం నరసాపురం నుంచి బెంగళూరు(Narasapuram to Bangalore)కు వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.07153 నరసాపురం-ఎస్‌ఎంబీటీ బెంగళూరు వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 9, 16, 23, 30 (శుక్రవారాలు) తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు నరసాపురంలో బయల్దేరి శనివారం ఉదయం 9.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. అలాగే, నెం.07154 ఎస్‌ఎంబీటీ బెంగుళూరు- నరసాపురం వారంతపు ప్రత్యేక రైలు ఈ నెల 10, 17, 24, జూలై 1 (శనివారం) తేదీల్లో ఉదయం 10.50 గంటలకు బెంగళూరులో బయల్దేరి ఆదివారం ఉదయం 6 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. ఈ రైళ్లు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల(Vijayawada, Tenali, Bapatla, Chirala), ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు.