Rajasthan CM: మరో సర్‌ప్రైజ్‌కు సిద్ధంకండి.. హింట్ ఇచ్చిన బీజేపీ
ABN, First Publish Date - 2023-12-12T15:25:28+05:30
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల ఎంపికలో పరిశీలకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయాలు తీసుకున్న క్రమంలో రాజస్థాన్ సీఎం విషయంలోనూ ఇదే జరగనుందంటూ బీజేపీ మాజీ ఎంపీ, రాజస్థాన్ ఎమ్మెల్యే కిరోడి లాల్ మీనా చలన 'హింట్' ఇచ్చారు.
జైపూర్: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల ఎంపికలో పరిశీలకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయాలు తీసుకున్న క్రమంలో రాజస్థాన్ సీఎం (Rajasthan CM) విషయంలోనూ ఇదే జరగనుందంటూ బీజేపీ మాజీ ఎంపీ, రాజస్థాన్ ఎమ్మెల్యే కిరోడి లాల్ మీనా (Kirodi Lal Meena) సంచలన 'హింట్' ఇచ్చారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ..''ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో మీ అంచనాలు తప్పాయి. మరో సర్‌ప్రైజ్‌కు మీరు సిద్ధంకండి'' అని చెప్పారు. సీఎం విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఎమ్మెల్యేల ఏకాభిప్రాయం మేరకే ఉంటుందని కూడా ఆయన చెప్పారు.
రాజే ఇంట్లో ఎమ్మెల్యేల సమావేశంపై..
వసుంధరా రాజేను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కలుసుకోవడంపై మీనా మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 17 మంది ఎమ్మెల్యేలు తనను కూడా కలుసుకున్నారని చెప్పారు. దీనిని లాబీయింగ్‌గా భావించరాదని చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కారణంగా ఎంపీ పదవికి మీనా రాజీనామా చేశారు.
సీఎం రేసులో లేను: సీపీ జోషి
కాగా, ముఖ్యమంత్రి రేసులో తాను లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి తెలిపారు. లెజిస్లేటివ్ పార్టీ సమావేశం బుధవారం 4 గంటలకు జరుగుతుందని, కేంద్ర పరిశీలకులు కూడా వచ్చారని, సాయంత్రం 5 గంటల సమయానికల్లా సీఎం ఎవరనేది ప్రకటించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సీఎల్‌పీ సమావేశానికి కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తవడే, సరోజ్ పాండే, ప్రహ్లాద్ జోషి హాజరువుతున్నారు.
Updated Date - 2023-12-12T15:25:30+05:30 IST